టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించి, ఆపై తరుణ్ భాస్కర్ దర్శత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారారు. అయితే హీరోగా నటించిన ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ అందుకున్న విజయ్, ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అనంతరం పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా కూడా మరొక సూపర్ హిట్ కొట్టి విజయ్ ని టాలీవుడ్ స్టార్ హీరో ని చేసింది. అయితే ఆ తరువాత నుండి ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. 

 

నోటా, టాక్సీ వాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, ఇలా ఈ సినిమాలేవీ విజయ్ కు సక్సెస్ ని అందించలేకపోయాయి. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఫైటర్ లో నటిస్తున్న విజయ్, ఎలాగైనా ఆ సినిమాతో మంచి కొట్టి తన ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, విజయ్ గత సినిమా అయిన వరల్డ్ ఫేమస్ లవర్, ఇటీవల మంచి హైప్ తో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో పాటు బయ్యర్లకు చాలావరకు లాస్ తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. 

 

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ, కేఎస్ రామారావు ఎంతో భారీగా నిర్మించిన ఈ సినిమాలో ఇజా బెల్లె, క్యాథరీన్ థెరిస్సా, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలోని కథ, కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాని మరొక మూడు రోజుల్లో అనగా ఏప్రిల్ 15న ప్రముఖ డిజిటల్ ఓటిటి మాధ్యమం సన్ నెక్స్ట్ లో ప్రసారం చేయనున్నారు. అయితే థియేటర్స్ లో ఘోరంగా ఫ్లాప్ అయిన ఈ సినిమా, డిజిటల్ మీడియాలో ఎంత మేర సక్సెస్ అయి ఏ విధమైన వ్యూస్ ని దక్కించుకుంటుందో అని నిర్మాతలు ఇప్పటినుండే లోలోపల కొంత ఆందోళన చెందుతున్నారట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: