హా.. అతను మంచి నటుడు అని చెప్పలేం.. కానీ పెద్ద మనసున్న వ్యక్తి అని చెప్పగలం.. ఎందుకంటే అయన మనసులో ముగ్గురు అమ్మాయిలకు స్థానం కలిపించాడు. అందుకే అతను పెద్ద మనసున్న వ్యక్తి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే? ముగ్గురమ్మాయిలకు ఎప్పుడు ఒకేసారి స్థానం ఇవ్వలేదు. 

 

మొదటి భార్యతో విడిపోయాక రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు.. రెండో భార్యకు విడాకులు ఇచ్చాక మూడో భార్యను చేసుకున్నాడు. అయితే ముగ్గురు భార్యలని అయన ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు.. ఇంతవరుకు బాగానే ఉంది.. ఇప్పుడు మరో విషయం తెరపైకి వచ్చింది. అది ఏంటి అంటే? అతను మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వనున్నాడు అని.. 

 

ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. టాలీవుడ్ నగరాల్లో ఈ వార్త హాల్ చల్ చేస్తుంది.. మూడో భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్య దగ్గరకే వెళ్తాడు అని టాలీవుడ్ లో ఓ రేంజ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గుసగుసలు విన్న కొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.. 

 

ఇంకా ఎంతమందికి విడాకులు ఇస్తావు సామీ! నీకు ఎందుకు పెళ్లి అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు కామెంట్ చేస్తూ.. హేయ్.. ఇవి ఎవరో పని పాట లేని వాళ్ళు సృష్టించినవి.. అన్ని నమ్మితే ఎలా అంటూ మరికొందరు అంటున్నారు. ఏమైతేనేం.. అప్పట్లో మూడో పెళ్లి చేసుకోబోతున్నాడట అని వార్తలు రాగానే మూడో పెళ్లి చేసుకొని దర్శనం ఇచ్చాడు.. కానీ ఇప్పుడు మూడో భార్యకు విడాకులు ఇస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మరి చివరికి ఎం అవుతుందో చూడాలి.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: