విక్టరి వెంకటేష్ హీరోగా వస్తున్న చిత్రం నారప్ప. తమిళ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపధ్యంలో వస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ కాస్త భిన్నంగా ప్రేక్షకులకు కనిపిస్తున్నాడు. ఈ సినిమా కథలో ఉండే కొన్ని కొన్ని కోణాలు ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఏ హీరో కూడా చేయని పాత్రను అతను చేస్తున్నాడు. మన తెలుగులో అయితే అలాంటి పాత్రను ఎవరూ కూడా దాదాపుగా చేయలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమా మీద చాలా మందికి ఆసక్తి ఉంది. 

 

సినిమా కథ విషయంలో వెంకటేష్ చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు అనేది అర్ధమవుతుంది. ఈ సినిమా కథ ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ ఆధారంగా ఉంటుంది. కథ అంతగా పట్టు లేకపోయినా చిన్న తేడా వచ్చినా సరే ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి ఉండదు. అందుకే కథలో తానే స్వయంగా మార్పులు కూడా చేసుకున్నట్టు సమాచారం. దర్శకుడికి ఈ మార్పులు చెప్పి చెయ్యమని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా రానుంది. 

 

అందుకే ఇప్పుడు ఈ సినిమా విషయంలో అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అంటున్నారు. పాన్ ఇండియా లో తమిళ మార్కెట్ చాలా కీలకం. ఈ సినిమా మాతృక తమిళ్. అందుకే ఇప్పుడు అక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా కథను రెడీ చేయిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ సహా కొన్ని లుక్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అందులో వెంకటేష్ కాస్త కొత్తగా కనిపించాడు. అతను చేస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో కచ్చితంగా సంచలనం అవుతుంది అనేది కొందరి మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: