అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రివేంజ్ డ్రామా పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ కి మంచి స్పందన లభించింది. అల వైకుంఠపురములో సినిమాలో అల్ట్రా స్టైలిష్ గా కనిపించిన అల్లు అర్జున్ పుష్పలో ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడు. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషలన్నింటిలో విడుదల అవుతున్న ఈ చిత్రం బన్నీ మొదటి పాన్ ఇండియా చిత్రం.

 

ఐదు భాషల్లో విడుదల అయిన ఫస్ట్ లుక్ అటు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు కూడా. తమిళులకి ఈ సినిమాపై ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది. తమిళ చిత్రాల్లో కనిపించినట్టుగా ఊరమాస్ లుక్ లో బన్నీ కనిపించడం ఒకటైతే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ తెరకెక్కడం కూడా ఒక కారణం. ఎర్రచందనానికి వారికి లింక్ ఏంటన్నదే ప్రశ్న.

 

గతంలో నల్లమల్ల అడవుల్లో ఒక ఎన్ కౌంటర్ జరిగింది. ఎర్రచందనం దుంగలని కత్తిరించి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ, పోలీసులు వారిని కాల్చివేశారు. అయితే అది నిజం ఎన్ కౌంటర్ కాదని, చిత్తూరు ప్రాంతంలోని ఊరివాళ్ళని అడవిలోకి తీసుకువచ్చి ఎన్ కౌంటర్ చేసి, స్మగ్లర్లని చంపేసినట్టు చిత్రీకరించారని వార్తలు వచ్చాయి. అంటే ఆ ఎన్ కౌంటర్ ఒక ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ... పోలీసులు కావాలనే ఇలా చేసారని అన్నారు.

 


తమిళనాడు నాడు కూడా ఈ వాదనని సమర్థించి ఆంధ్రప్రదేశ్ పభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అయితే ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో సుకుమార్ ఆ ఎన్ కౌంటర్ ని చూపిస్తాడేమో అని చూస్తున్నారు. నిజ జీవితంలోని జరిగిన వాస్తవాలని సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తాయి. మరి సుకుమార్ ఆ ఎన్ కౌంటర్ ని చూపిస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: