డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్ చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్యాచ్ వర్క్ మినహా సినిమా మొత్తం పూర్తయిందని సమాచారం. అనిల్ పాదూరి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జగన్నాథ్ రాసిన కథతో వస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట.

 

ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటకి మంచి స్పందన లభించింది. రొమాంటిక్ పోస్టర్ లో కేతిక శర్మ, ఆకాష్ ల కెమిస్ట్రీ చూస్తుంటే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయని అర్థం అవుతుంది. పూరి జగన్నాథ్ రాసిన పాట కూడా ఆకట్టుకుంది. గాఢమైన ప్రేమలో భావావేశం ఎలా ఉంటుందో ఆ పాట ద్వారా చెప్పాడు పూరి. సినిమా పేరునే రొమాంటిక్ అని పెట్టడంతో సినిమా ఇంకెంత రొమాంటిక్ గా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు.

 

అయితే పేరుకి తగ్గట్టుగానే సినిమా పూర్తి రొమాంటిక్ గా ఉండనుందట. మాస్ సన్నివేశాలు రాయాలన్నా, రొమాంటికి సన్నివేశాలు రాయాలన్నా పూరికి ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పే పూరిసినిమా కథని చాలా బాగా రాసాడని టాక్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది కాబట్టి పోకిరి సినిమాకి రొమాంటిక్ కి పోలిక ఉండవచ్చని అనుకుంటున్నారు. 

 

పోకిరిలో మహేష్ బాబు, ఇలియానా మధ్య వచ్చే సీన్లు చాలా బాగా వచ్చాయి. వారిద్దరి మధ్య ప్రేమని చాలా బాగా చూపించాడు పూరి. అయితే ఈ సినిమాలోనూ అలాంటి సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట. మెయిన్ క్లైమాక్స్ సీన్ అదిరిపోనుందట. ఇందులో క్లైమాక్స్ సీన్ న్ని ముద్దుతో ముగిస్తారట. హీరో, హీరోయిన్ ముద్దుపెట్టుకునేటపుడు ఎండ్ కార్డ్ పడుతుందట. పూరిజగన్నాథ్ రాసిన కథని అనిల్ పాదూరి ఎంతవరకు బ్యాలన్స్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: