ఈ ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠపురము లో సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అల్లు అర్జున్సినిమా చేస్తాడు అనేది అక్కడి నుంచి దర్శకులు, నిర్మాతలు చాలా ఎదురు చూసారు. ముందు నుంచి అనుకున్న విధంగానే అతను సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా లుక్ అతని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. ఇక ఈ సినిమా టైటిల్ చూస్తే పుష్పా అనే టైటిల్ ని పెట్టారు. 

 

పుష్ప టైటిల్ కాస్త భిన్నంగా ఉంది. అందు లో అతని పాత్ర పేరు పుష్ప రాజ్. ఇక అతని పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అతని పాత్ర పేరు పుష్ప కావడం అందులో అతను యెర్ర చందనం దొంగగా నటించడం తో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే అతని పాత్ర ఈ సినిమా దొంగగా ఉండటమే కాకుండా అతనికి చెవుడు అని అంటున్నారు. అతని పాత్ర ఆధారంగా సినిమాలో చాలా మార్పులు దర్శకుడు చేసాడు. ముందు అతని పాత్రను నీట్ గా చూపించాలి అని చూసినా ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు అలాంటి పాత్రలు బాగా ఎక్కే అవకాశం ఉందని భావించి కథలో మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. 

 

అతనికి చెవుడు అని అలాగే రే చీకటి కూడా ఉంటుంది అంటున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. ఇక నిర్మాణ సంస్థ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదల చెయ్యాలని చూసినా కొన్ని మార్పుల కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: