స్వీయ నిర్బంధంలో కొన‌సాగుతున్న బాలీవుడ్‌, టాలీవుడ్ తార‌లు...కాల‌క్షేపానికి త‌మ‌కిష్ట‌మైన అభిరుచుల‌ను ఎంచుకుంటున్నారు. చాలా మంది తార‌లు త‌మ‌కు దొరికిన ఈ ఖాళీ స‌మ‌యంలో వంటలు చేయడమో, బొమ్మలు గీయడమో, ఏదైనా నేర్చుకోవడమో.. ఇలా ఏదో ఒకటి చేసేస్తున్నారు. అయితే వీరంద‌రికి చాలా భిన్నంగా బాలీవుడ్ భామ భూమి ఫ‌డ్నేక‌ర్ మాత్రం వ్య‌వ‌సాయం చేయ‌డం గ‌మ‌నార్హం. అది కూడా హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ (నేల అవసరం లేకుండా పండ్లు, కూరగాయల పెంపకం) చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించేసింది. త‌న ఫార్మింగ్ విశేషాల‌ను కూడా అభిమానుల‌తో పంచుకుంది.

 

‘‘మా అమ్మ (సుమిత్ర), నేను ఎప్పట్నుంచో హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆచరణలో పెట్టాం. హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ ద్వారా మా గార్డెన్‌లో కూరగాయలను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫార్మింగ్‌ గురించి నాకు పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఆస‌క్తి ఉంది. దీంతో ఈ వ్య‌వ‌సాయం ప‌ద్ధ‌తి గురించి ఆరంగంలోని నిపుణుల‌ను అడిగి తెలుసుకుంటున్నాను’’ అని వెల్ల‌డించింది భూమి ఫడ్నేకర్‌. ఇదిలా ఉండ‌గా తెలుగులో అనుష్క హీరోయిన్‌గా వ‌చ్చిన భాగ‌మ‌తి చిత్రాన్ని ప్ర‌స్తుతం దుర్గావ‌తి పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో భూమి ఫ‌డ్నేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

 

 అయితే లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్ ఆగిపోవ‌డంతో స్వీయ నిర్బంధంలో ఇలా త‌న‌కు న‌చ్చిన హాబిస్‌తో గ‌డిపేస్తోంది ఈ భామ‌. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ నేప‌థ్యంలో  సినిమా క‌ష్టాలు తొల‌గ‌డం లేదు. భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు వేల కోట్ల‌లో న‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. భవిష్య‌త్‌లోనూ సినిమా థియేట‌ర్లు న‌డిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని బాలీవుడ్ నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ప‌రిస్థితి ఇదే విధంగా ఉంటే భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను న‌మ్మ‌కున్న ల‌క్ష‌లాది మంది సినీ కార్మికులు, ఈ రంగంలో వివిధ ద‌శ‌ల్లో ఉన్న ఉద్యోగుల భ‌విష్య‌త్ అంధ‌కారమ‌య్యే ప‌రిస్థితి ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: