ఎప్పుడూ సినిమాలతో యమా బిజీగా ఉండే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాలు ప్రయాణాలతో పాటు తన ఆరోగ్య సమస్యల గురించి కూడా అభిమానులతో పంచుకుంటుంటాడు. కొద్ది నెలల క్రితం తన ఆరోగ్యం బాగోలేదని, డాక్టర్ రెస్ట్ తీసుకొమ్మన్నట్టుగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు. అయితే తనకు మాత్రం బ్రేక్ తీసుకునేందుకు ఇష్టం లేదని సినిమాలు చేస్తూనే ఉంటానని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ మెగాస్టార్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

 

తాజాగా బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ మరో ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. ఆయన తన కంటిచూపు మందిగిస్తుందన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని వివరించాడు. `నా కళ్లకు దృశ్యాలు స్పష్టంగా కనిపించటంలేదు. కొద్ది రోజులుగా అన్ని రెండుగా కనిపిస్తున్నాయి. అంధ్వత్వం రాబోతుందన్న విషయం నాకు అర్ధమైంది. ఇప్పటికే ఉన్న వందలాది సమస్యలతో పాటు ఇది కూడా` అంటూ తన బాధను పోస్ట్ చేశాడు.

 

ఈ సందర్భంగా ఆయన తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నాడు. `మా అమ్మ తేజీ బచ్చన్‌ నా చిన్నతనంలో కంటి సమస్య వస్తే తన చీర అంచును ఓ బాల్ లా చూట్టి గాలి ఊది.. ఆ వెచ్చటి ఆవిరిని కంటి మీద పెట్టేది. అలా సమస్యకు పరిష్కారం చూపించేది` అంటూ తన చిన్నతనం గుర్తు చేసుకున్నాడు. ఆయన కంటి సమస్య గురించి డాక్టర్లు ఏం అన్నాడో కూడా వివరించాడు బిగ్ బీ. డాకర్లు తన చూపు తిరిగి వస్తుందని హామీ ఇచ్చారు. ఎక్కువ సమయం కంప్యూరట్ స్క్రీన్ ముందు ఉన్న కారణంగా కళ్లు స్టెయిన్‌ అయ్యి ఈ సమస్య వచ్చిందని డాక్టర్లు తెలిపినట్టుగా చెప్పాడు.

 

అందుకే హాట్ వాటర్‌లో ముంచిన టవల్‌ ను కాసేపు కళ్ల మీద పెట్టుకోవటం, డాక్టర్లు సూచించిన ఐ డ్రాప్స్‌ను ప్రతీ గంటకు కంట్లో వేసుకోవటం ద్వారా నేను అంధున్ని కాలేదు. అంటూ తెలిపాడు అమితాబ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

air