తారక్ 'టెంపర్' సినిమా నుండి ఆచితూచి అడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు. కేవలం కథాబలం ఉన్న డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస హిట్లు కొడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తరువాత తన కెరీర్లో 30వ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తో కమిట్ అయిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మే నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటెర్టైమెంట్స్ రాధాకృష్ణ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ కోసం అనేక మంది టాప్ డైరెక్టర్స్ లైన్లో ఉండగా త్రివిక్రమ్ వైపే ఆయన మొగ్గు చూపడానికి కారణం ఏమిటనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. 'అల వైకుంఠపురంలో' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే దీనికి ప్రధాన కారణం అని అందరూ అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఆలోచన వేరుగా ఉందని సమాచారం.

 

NTR30 Big Announcement! Jr NTR film with Trivikram Srinivas ...

 

ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సౌత్ లో స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ వారికి ప్రస్తుతాని అవకాశం ఇవ్వలేదు. ఇతర సినీ పరిశ్రమలకు చెందిన డైరెక్టర్ల కథలు.. టేకింగ్ మన నేటివిటీకి సరిపడకపోవచ్చు. గతంలో కొంత మంది హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేసి దెబ్భై పోయి ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ వారితో సినిమా చేయడం సేఫ్ కాదని భావించారట. అందుకే త్రివిక్రమ్ తో వెళ్ళాడట.  అంతేకాకుండా రాజమౌళి హీరోల నెక్స్ట్ మూవీ ప్లాప్ సెంటిమెంట్ ఎటూ ఉండనే ఉంది. కాబట్టి సేఫ్ డైరెక్టర్ ని ఎంచుకోవడమే బెటర్ అని భావించాడట. ఇక త్రివిక్రమ్ ట్రాక్ చూస్తే హిట్ లేదా అబౌ యావరేజ్ సినిమాలు ఇచ్చారు. 'అజ్ఞాతవాసి' లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ ఆయన కెరీర్లో అలాంటివి తక్కువే ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఓటేశాడని సమాచారం.

 

Trivikram to direct NTR's 30th film, release set for next year

 

ఇక ఎన్టీఆర్ తన 31వ చిత్రం మాత్రం అట్లీ లేదా ప్రశాంత్ నీల్ తో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ తారక్ కి నచ్చిందని.. ఆయన పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అట్లీ కూడా షారుక్ ఖాన్, విజయ్ సినిమాల తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడట. కాగా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: