ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బిగ్ బాస్ షో సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ మా ఛానెళ్లో గత మూడేళ్లుగా బిగ్ బాస్ ప్రసారం అవుతోంది. బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ గా వ్యవహరించగా సీజన్ 2 కు నాని, సీజన్ 3 కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ మూడు సీజన్లలో మొదటి సీజన్ ఆకట్టుకున్నంతగా ప్రేక్షకులను మరే సీజన్ ఆకట్టుకోలేదు. నిజానికి రెండో సీజన్, మూడో సీజన్ కు ఎన్టీయార్ ను సంప్రదించినా జూనియర్ అంగీకరించలేదని సమాచారం. 
 
తొలి సీజన్ తో ఎన్టీయార్ ఈ షోపై తనదైన ప్రత్యేక ముద్ర వేశాడు. సీజన్ 1 లో కాంటెస్టెంట్లు పెద్దగా ఆకట్టుకోకపోయినా జూనియర్ తన హోస్టింగ్ తో అదరగొట్టేశాడు. నాని, నాగార్జున బాగానే హోస్ట్ చేసినప్పటికీ జూనియర్ ఆకట్టుకున్న స్థాయిలో వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. కనీసం సీజన్ 4 కు జూనియర్ హోస్ట్ గా వ్యవహరించాలని జూనియర్ అభిమానులు, టీవీ వీక్షకులు కోరుకుంటున్నారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి. టీవీ ఛానెళ్లు పాత షోలను రీ టెలికాస్ట్ చేస్తున్నాయి. స్టార్ మా నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 1 ను పునః ప్రసారం చేయగా వీక్షకుల నుంచి వస్తున్న స్పందనను చూసి ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. ఎన్టీయార్ ఉన్న ఎపిసోడ్స్ కు విపరీతమైన ట్రాఫిక్ వస్తున్నట్లు మాటీవీ వర్గాలు చెబుతున్నాయి. 
 
మరి ఎన్టీయార్ బిగ్ బాస్ 4వ సీజన్ హోస్ట్ చేయడానికైనా అంగీకరిస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. 2021 జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. జూనియర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఎన్టీయార్ ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: