హీరో అనే మాటలో ఓ కిక్ ఉంటుంది. ఒక్కసారి ఆ కిక్ ఎక్కితే బయటపడటం చాలా కష్టం. ఎక్స్ పెరిమెంట్స్ 
చేయాలనే ఆలోచనలు కూడా రానివ్వనంత మత్తుగా ఉంటుందీ మాట. కొంతమంది ఈ మత్తులోనే మార్కెట్ కు దూరమైతే.. మరికొంతమంది హీరోయిజాన్ని పక్కనపెట్టి కిక్ ఇచ్చే క్యారెక్టర్స్ లా మారుతున్నారు. 


మక్కల్ సెల్వన్ గా విజయ్ సేతుపతికి తమిళనాట ఫుల్ క్రేజ్ ఉంది. విజయ్ ఉంటే చాలు సినిమా మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు కూడా నమ్ముతుంటారు. సేతుపతి బ్రాండ్ తో సినిమాలు కూడా భారీగానే వసూల్ చేస్తున్నాయి. కానీ ఇమేజ్ ను మార్కెట్ లెక్కలతో కట్టిపడేయటం లేదు సేతుపతి. ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. 

 

విజయ్ సేతుపతి హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. 96 లాంటి ప్రేమకథతో ఇండియన్ యూత్ కు దగ్గరైన మక్కల్ సెల్వన్, ఇప్పుడు విజయ్ మాస్టర్ సినిమాలో విలన్ గా నటించాడు. హీరోయిజాన్ని డామినేట్ చేసే నెగిటివిటీని ప్రజెంట్ చేయబోతున్నాడు. ఇక ఇంతకుముందు రజినీకాంత్ పేటలోనూ నెగిటివ్ రోల్ ప్లే చేశాడు సేతుపతి.  

 

ఉదయనిధి స్టాలిన్ లాంటి చిన్న హీరోలు కూడా తెలుగు మార్కెట్ ను సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేను రౌడీనే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సేతుపతి మాత్రం ఇక్కడ విలన్ గా నటించేందుకు ఓకే చెప్తున్నాడు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతోన్న ఉప్పెన లో విలన్ గా నటించాడు. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ విలన్ గా నటించబోతున్నాడు. 

 

కాంబినేషన్ లు, బడ్జెట్ లు అన్నీ మార్కెట్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎంతపెద్ద హీరో అయినా మార్కెట్ కు లోబడే సినిమాలు చేయాలి. కానీ బాలీవుడ్ లో ఓ స్టార్ మాత్రం మార్కెట్ కు ఎదురెళ్తున్నాడు. మార్కెట్ లెక్కలతో పనిలేకుండా జర్నీ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: