దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ చేస్తున్న బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. అయితే కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కరోనా రక్కసిని అడ్డుకోవడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి.  అందులో భాగంగానే గత నెల24 నుంచి లాక్ డౌన్ ని విధించాయి. ఈ క్రమంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, మీడియా తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు.  లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటికి పరిమితం అవుతూ.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించిన విషయం తెలిసిందే.  

 

కానీ కొంత మంది లాక్ డౌన్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు.. కోట్ల మంది ఒకవైపు ఉంటే.. కొంత మంది మరోవైపు ఉంటున్నారు.  పదే పదే బయటకు రావడం పోలీసులకు లేని పోని సాకులు చెప్పి ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు.  కొంతమంది పోలీసులపై దాడులు చేస్తున్నారు. పంజాబ్ లూథియానాలో ఓ పోలీస్ అధికారి చేయి నరికిన విషయం తెలిసిందే. మరికొన్ని చోట్ల పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. కొన్ని చోట్లల్లో డాక్టర్లపై వైద్యులపై దాడులు జరుగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ దీనిపైన స్పందించాడు.. చదువుకున్న వారే వైద్యులపై పోలీసులపై దాడి చేయడం అమానుషమని అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. ఇలా దాడులు చేసే వారే అసలైన నేరస్తులని అజయ్ దేవగన్ అభిప్రాయపడ్డాడు. మనం అత్యంత ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాం.. ఈ సమయంలో నిర్భయం కోల్పోతే మరిన్ని నష్టాలు.. కష్టాలు వస్తాయని అన్నారు. ఇక కరోనా రక్కసిని అడ్డుకోవడానికి తన వంతుగా 51 లక్షలను ఆర్థిక సహాయం అందించాడు అజయ్ దేవగన్.. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి ప్రభుత్వాలకు సహకరించాలని త్వరలోనే భారత్ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: