జెర్సీ కి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అయిన నాని ఆతరువాత గ్యాంగ్ లీడర్ కు కూడా అతన్నే కొనసాగించాడు. ఈ సినిమాకు కూడా అనిరుద్  డిస్సపాయింట్ చేయలేదు. ముఖ్యంగా ఆల్బమ్ సంగతి అటు ఉంచితే ఈ రెండు సినిమాలకు అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది. ఇక ఈ రెండు సినిమాలతో ఫుల్ ఇంప్రెస్ అయిన నాని తాజాగా మరో సారి అనిరుద్ కు అవకాశం ఇప్పించాడట. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ డైరెక్షన్ లో నాని ,శ్యామ్ సింగ రాయ్ లో నటించనున్నాడు. ఈ చిత్రానికి మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్.రెహమాన్ పేరు వినపడింది కానీ తాజగా అనిరుద్ ను ఫైనల్ చేశారని సమాచారం. 
 
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ ను ఖరారు చేయలేదు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఓ షెడ్యూల్ ను కూడాపూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ , తమిళ నటి  ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా  థమన్ సంగీతం అందిస్తున్నాడు షైన్ స్క్రీన్ బ్యానర్ పై  సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇక ఈరెండు సినిమాల కన్నా ముందు నాని వి తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాని 25వ సినిమా గా రానున్న ఈ చిత్రం మార్చి 25న  విడుదలకావాల్సి వుంది కానీ కరోనా అడ్డుపడడం తో రిలీజ్ ఆగిపోయింది. జూన్ లేదా జులై లో ఈ సినిమాను థియేటర్లలోకి  తీసుకురానున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: