హిట్ ఇచ్చినా సినిమా ఆఫర్లు  లేక, అసలు ఒక్క సినిమా ఛాన్స్ దక్కించుకోడాని కే ఆపసోపాలు పడుతున్న డైరెక్టర్లున్న ఈ టైమ్ లో కొంతమంది డైరెక్టర్లు మాత్రం అడ్వాన్స్ బుక్ అయిపోయారు. ప్రజెంట్ చేస్తున్న సినిమాతో పాటు.. మరో సినిమాని రిజర్వ్ లో ఉంచుకుని కాలర్ ఎగరేస్తున్నారు. టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్లు ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చినా నెక్ట్స్ ఆఫర్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకో వైపు మాత్రం ఒక సినిమా ఇంకా కంప్లీట్ అవ్వనే లేదు.. మాతో సినిమా చెయ్యండి అంటూ కమిట్ చేసేసుకున్నారు కొంతమంది హీరోలు.

 

అప్పుడెప్పుడో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా తరవాత  ఏకంగా పవన్ కళ్యాణ్‌ సినిమాతో జాక్ పాట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్. పవర్ స్టార్ రీ ఎంట్రీ  పింక్ మూవీ రీమేక్ వకీల్ సాబ్  షూటింగ్ లో బిజీగా ఉన్నాడు వేణు. అయితే ఈ సినిమా  తర్వాత బన్నీతో ఐకాన్ సినిమా లైన్లో ఉంది ఈ డైరెక్టర్ కి. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా కన్నాసినిమా ముందే అనుకున్నా.. రకరకాల రీజన్స్  సినిమా ఆగిపోయింది.
 
ప్రజెంట్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ మొన్నా మద్య అలవైకుంఠపురంలో సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు . బన్నీతో సినిమా అయిపోగానే.. ముందునుంచీ అనుకున్నట్టు గానీ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఈ సంవత్సరం ఏప్రిల్ లో సినిమా స్టార్ట్ చేసి నెక్ట్స్‌ మే కి  రిలీజ్ చేద్దామని అఫీషయిల్ గా చెప్పారు త్రివిక్రమ్ అండ్ టీమ్. ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకముందే చిరంజీవి, త్రివిక్రమ్ ని లైన్లో పెట్టేశారు. ఎప్పటినుంచో మెగాస్టార్ తో సినిమా చేద్దామనుకుంటున్న త్రివిక్రమ్.. చిరంజీవికి మంచి స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేసేశాడు.

 

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మరో డైరెక్టర్ శివనిర్వాణ. నానితో  నిన్నుకోరి సినిమా తరువాత  నాగచైతన్య, సమంత కాంబినేషన్లో మజిలీ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు . ఇప్పుడు మళ్లీ నానితో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా ... రౌడీ హీరో విజయ్ దేవరకొండకి స్టోరీ చెప్పి.. విజయ్ తో నెక్ట్స్  సినిమాకి ఖర్చీఫ్ వేసేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: