చిరంజీవికి ఆందోళన ఏంటి, ఆయన నంబర్ వన్ స్టార్. సీనియర్ మోస్ట్ హీరో. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు. అటువంటి మెగాస్టార్ ఎందుకు కలత చెందుతున్నారు. ఆయన బాధకు కారణమేంటి. అంటే చెప్తే చాలానే ఉంది. చిరంజీవి ఇంట్లో  డజన్ మంది దాకా హీరోలు ఉన్నారు. అంతా కూడా సక్సెస్ ఫుల్ ట్రాక్ లోనే ఉన్నారు. ఇక కొడుకు చరణ్ సూపర్ స్టార్ డం సొంతం చేసుకున్నారు. అయినా చిరంజీవికి ఉన్న బాధ ఏంటి..

 

ఈ మధ్య ఓ ఆంగ్ల పత్రికకు చిరంజీవి ఇంటర్వ్యూ ఇస్తూ తెలుగు సినిమావే కాదు, మొత్తం భారతీయ  సినీ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగం ఒకపుడు వైభవంగా ఉండేదని, ఇపుడు మాత్రం చరిత్రలో కనీ వినీ సమస్యలో కూరుకుపోతోందని చిరంజీవి ఆందోళన చెందారు.

 

కరోనా వైరస్ మహమ్మారిగా మారి  మొత్తం సీన్ మార్చసిందని ఆయన అన్నారు. సినిమాకు కరోనా అతి పెద్ద విలన్ అయిందని కూడా అభిప్రాయపడ్డారు. సినిమా రంగం మళ్ళీ కోలుకోవాలంటే చాలా కాలమే పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా పరిశ్రమ ఇపుడు పుట్టెడు కష్టాలతో ఉందని కూడా అన్నారు.

 

ఇపుడున్న పరిస్థితుల్లో అంతా కొన్ని మెట్లు దిగిరావాలని ఆయన అన్నారు. ఫైనాన్షియర్లు నిర్మాతలకు తక్కువ వడ్డీకి అప్పు ఇవ్వాలని, అలాగే వివిధ విభాగాలు కలసి పనిచేయాలని, అపుడే పరిశ్రమ పూర్వపు స్థితికి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతా మొదటి నుంచి ప్రారంభించాలని కూడా ఆయన అంటున్నారు. ఏది ఏమైనా కష్టకాలంలో అంతా ఒక్కటిగా ఉండాలని కూడా ఆయన సూచించారు. 

 

ఏది ఏమైనా గతంలో లేనిది ఇపుడు వచ్చి పడింది. కరోనా వల్ల అంతాతల్లకిందులైంది సినిమాలో ఒక సీన్ మొత్తం సినిమాను  మార్చేసినట్లుగా కధ మొత్తం అడ్డం తిరిగింది. అదే ఇపుడు చిరంజీవి బాధగా ఉందిట.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: