‘రంగస్థలం’తో నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ తో మరో ప్రయోగాత్మక సినిమాకు సిద్దమవుతున్నారు.  తన సినిమాల్లో ఎప్పటికప్పుుడు హీరోలను కొత్తదనంతో చూపించే సుకుమార్ ఈసారి అల్లు అర్జున్ ని ఊరమాస్ లుక్ తో చూపించబోతున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఈ లుక్ లో గందపు చెక్కల పక్క పోలీసు మద్య నేలపై కూర్చున్న అల్లు అర్జున్ నెరసిన చుట్టు.. గెడ్డం తో డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. సుకుమార్ మామూలుగానే స్క్రిప్టు తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఒక పట్టాన దేనికీ సంతృప్తి చెందని ఆయన మార్పులు చేర్పులు చేస్తూనే వెళ్తుంటాడు.

 

అయితే ఈ మూవీ త్వరగా పూర్తి చేసుకొని వెసవిలో రిలీజ్ చేయాలని భావించారు. ఇంతలో కరోనా అడ్డం రావడం.. షూటింగ్స్ మొత్తం వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ ఖాళీ సమయంలో ప్రి ప్రొడక్షన్ పనులు మరింత పక్కాగా చేసుకునే పనిలో ఉంది చిత్ర బృందం. ఇలాంటి సమయంలో మూవీ బృందానికి పెద్ద షాక్ తగిలినట్లు వార్తలొస్తున్నాయి.  పుష్ప’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోనున్నట్లు సమాచారం.  అక్రమ కలప రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం.

 

లాక్ డౌన్ తరువాత విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదట. ఈ ఒక్క సినిమా చేయాలంటే తమిళంలో ఆయన రెండు మూడు సినిమాలు వదులుకోవలసి వస్తోందట. అందువలన ఆయన 'పుష్ప' నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, విజయ్ సేతుపతి స్థానంలో బాబీసింహాను తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం.  ఆ మద్య రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ మూవీలో బాబీ సింహా విలన్ గా నటించిన విషయం తెలిసందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: