స‌నాఖాన్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. బాలీవుడ్లో మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స‌నాఖాన్ ఆ త‌ర్వాత అక్క‌డ మోడ‌లింగ్‌తో పాటు చిన్నా చిత‌కా వేషాల‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత తెలుగులోనూ హీరోయిన్‌గా చేసింది. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన క‌త్తి సినిమాతో పాటు మంచు మ‌నోజ్ చేసిన మిస్ట‌ర్ నూక‌య్యా సినిమాలో సైతం న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె చుట్టూ అనేక కాంట్ర‌వ‌ర్సీలు అల్లుకున్నాయి. కెరీర్ అనుకున్నంత‌గా ముందుకు సాగ‌లేదు.

 

మ‌ళ్లీ బాలీవుడ్‌లోకి చెక్కేసినా ఆమెను ప‌ట్టించుకున్న వారు లేరు. ఆ త‌ర్వాత ఓ భాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని ప్రేమా దోమా అంటూ తిరిగింది. వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని అనుకుంటోన్న టైంలో అత‌డితో విడిపోయింది. అక్క‌డితో ఆగ‌ని స‌నా త‌న మాజీ భాయ్‌ఫ్రెండ్‌ను టార్గెట్‌గా చేసుకుని కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ప‌లు సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేస్తోంది. తాజాగా ఆమె త‌న మాజీ ప్రియుడు అయి మాలెవిన్ లూయిస్ చీక‌టి బాగోతాన్ని బ‌ట్ట బ‌య‌లు చేసింది.

 

తాను జీవితంలో ఎవ్వ‌రిని న‌మ్మ‌నంత‌గా లూయీస్‌ను న‌మ్మాన‌ని... అయితే ఆ త‌ర్వాత త‌న‌కు అత‌డి చీక‌టి కోణం తెలిసింద‌ని చెప్పింది. తాను త‌న క‌ళ్ల‌తోనే లూయీస్ రాస‌లీల‌లు చూడాల్సిన దుస్థితి వ‌చ్చింద‌ని ఆమె వాపోయింది.  త‌న ప్రియుడు లూయిస్ ఒక బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కుడు) అని.. నాతో ఎఫైర్ కు ముందే ఆయనకు మరో అమ్మాయి తో సంబంధం ఉందని సనాఖాన్ తెలిపింది. 

 

ఇక లూయీస్ ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయికి చాలా మంది అమ్మాయిల‌తో సంబంధాలు ఉన్నాయని.. అలాగే ఆమెకు ఎంతో మంది అబ్బాయిల‌తో సంబంధాలు ఉన్నాయని.. ఆమె ఒక లెస్బియన్ అని తెలిపింది. అంటువంటి అమ్మాయితో సంబంధం పెట్టుకొని తనను మోసం చేస్తాడని అనుకోలేదని సనాఖాన్ పేర్కొంది. ఏదేమైనా దేవుడు త‌న‌కు మంచి చేశాడ‌ని ఆమె పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: