హిట్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే.. అంచనాలు భారీగా ఉండటం సహజం. హిట్ పెయిర్ మళ్లీ కలిసి నటిస్తే.. అభిమానుల్లోనే కాదు అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఆ ఇద్దరిది హిట్ కాంబినేషనే కాదు. భార్యా భర్తల రిలేషన్ షిప్. పెళ్లయిన తర్వాత ఇద్దరూ కలిసి రెండో సినిామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 

సమంత, నాగచైతన్యది హిట్ పెయిర్. నాలుగు సినిమాలు చేస్తే మూడు సినిమాలు హిట్. ఏమాయ చేసావే సినిమాతో సమంతకు పరిచయం కాగా.. ఈ జంటకు హిట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత నటించిన మనంతో మరోసారి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. మూడో సినిమా ఆటోనగర్ సూర్య ఫ్లాప్ అయినా.. నాలుగో సినిమా మజిలీ చైతూ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 

 

ఏమాయ చేసావే సక్సెస్ నాగచైతన్యకు స్టార్ డమ్ తీసుకురాలేకపోయినా.. సమంత మాత్రం తొలి సినిమాతోనే మాయచేసి.. స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ మూవీతో ప్రేమ చిగురించగా.. పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత చైతూ, సమంత ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే.. సమంత మాత్రం చైతూ కెరీర్ గురించే ఎక్కువ ఆలోచిస్తోంది. శ్రీవారి క్రేజ్ తీసుకొచ్చే పనిలో.. ఎంత  బిజీగా ఉన్నా ఛాన్స్ దొరికినప్పుడల్లా చైతూతో కలిసి నటిస్తోంది సమంత. 

 

హిట్ పెయిర్ సమంత, చైతు ఐదోసారి జతకడుతున్నారు. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే.. నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తాడు. ఇందులో హీరోయిన్ గా సమంత  పేరు వినిపిస్తోంది. నందిని డైరెక్షన్ లో సమంత ఓ బేబి మూవీ చేసింది. ఓ బేబితో ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో.. ఈ హిట్ పెయిర్ తో మరో హిట్ కు రెడీ అవుతోంది నందినిరెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: