తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులుగా మారిన రచయితలు ఎంతో మంది ఉన్నారు. తమ కథలకు మాటలు కూడా రాసుకుంటూ దర్శకత్వంలో రాణిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర నుంచీ నేటి కొరటాల శివ వరకూ ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు. వీరిలో సక్సెస్ శాతం కూడా ఎక్కువే. కేవలం దర్శకత్వం వైపునే కాకుండా కొందరు నిర్మాతలుగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇందుకు వీరి వద్ద అసిస్టెంట్స్ గా పని చేసేవారి టాలెంట్ ను గుర్తించి వారికి దర్శకులుగా అవకాశం ఇస్తున్నారు.

 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మించే ప్లాన్ ఉన్నాడని టాలీవుడ్ సమాచారం. తన టీమ్ లోని ఓ లేడీ అసిస్టెంట్ ను డైరక్టర్ గా పరిచయం చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం రౌండ్ అవుతున్న ఈ వార్త లాక్ డౌన్ పరిస్థితుల తర్వాత అఫిషియల్ కన్ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది. సాధారణంగా దర్శకులు తమ కథలను తమ అసిస్టెంట్లతో తెరెకెక్కించడం ఎప్పటినుంచో జరుగుతున్నదే. దాసరి దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ. శంకర్, త్రివిక్రమ్, సుకుమార్, సంపత్ నంది.. ఇలా చాలా మంది నిర్మాతలుగా మారిన వారిలో ఉన్నారు.

 

 

స్వతహాగా రచయితల వద్ద కథలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. అగ్ర దర్శకులుగా మారిన తర్వాత కొన్ని కథలకు వీరు దర్శకత్వం వహించటానికి వీలు పడదు. ఈ సమయంలో తమ శిష్యులను పరిచయం చేస్తూంటారు. కొరటాల శివ కూడా ఈ లిస్టులో జాయిన్ కానున్నాడు. నిజానికి ఇలాంటి సమయాల్లోనే కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ సినిమా కొరటాల శివ కథా.. లేక ఆ లేడీ అసిస్టెంట్ కథను నిర్మాతగా కొరటాల తెరకెక్కిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: