మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకపక్క జక్కన్న ‘RRR’ సినిమా చేస్తూనే మరో పక్క కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో కీలక పాత్ర చేయడానికి రెడీ అయ్యారు. ముందుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘RRR’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రని మొదలు పెట్టడం జరిగింది. రాజమౌళి సినిమాకి సంబంధించి చాలా వరకు తన క్యారెక్టర్ షూటింగ్ నీ పూర్తి చేశాడు. ఇటువంటి టైం లో కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాలో ముందుగా రామ్ చరణ్ క్యారెక్టర్ నీ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. సినిమాలో చిరంజీవి శిష్యుడిగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. దేవాదాయశాఖ ఆఫీసర్ గా చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

 

దీంతో ఆ శాఖలో ఉండే అవినీతిని పూర్తిగా పారద్రోలే క్రమంలో చరణ్ తన ప్రాణాలను కోల్పోతాడు అంట..మిగతా బ్యాలెన్స్ కాదని చిరంజీవి పూర్తి చేస్తారట. దాదాపు సినిమాల్లో 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకూ రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటుందని..చాలా ఎమోషనల్ గా ఉంటుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే సైరాలో అమితాబ్ పాత్రలా 'ఆచార్య' లో చరణ్ పాత్ర రక్తి కట్టించనుందని తెలుస్తోంది.

 

ముఖ్యంగా చిరుకి కొడుకుగా నటించడంతో...నటనలో తండ్రితో పోటీ పడగలడా అని అంటున్నారు. అంతేకాకుండా అటువంటి బరువు కలిగిన క్యారెక్టర్ రామ్ చరణ్ మోయగలడా...బ్యాలెన్స్ అయ్యే పనేనా అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. కాగా త్వరలో లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయబోతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్ లలో రామ్ చరణ్ ఏవిధంగా వ్యవహరిస్తారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: