పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సినిమా రంగంలో అడుగు పెట్టడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పవన్ నటించిన చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలకు పరిమితమయ్యారు. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తిగా రాజకీయ రంగానికి పరిమితమై పోతారు అని భావించారు. కానీ అనూహ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో అడుగుపెట్టి వరుసపెట్టి సినిమా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమా, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో, అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాలు ఓకే చేశారు పవన్.

 

ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులపై నాగబాబు లీకులు ఇచ్చే విధంగా తన యూట్యూబ్ ఛానల్ లో చేస్తున్న సినిమా ప్రాజెక్టుల గురించి స్టోరీలు గురించి అభిమానులతో అనేక విషయాలు పంచుకున్నారు. పింక్ సినిమా రీమేక్ ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ ఓకే చేయడానికి కారణం తన బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని అందుకే ఒప్పుకున్నట్లు నాగబాబు తెలిపారు.

 

సినిమా ఓకే చేయకముందు పవన్ ఇదే విషయాన్ని తనకు తెలియజేసినట్లు నాగబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మొగలాయిల కాలానికి సంబంధించిందని... కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని చాలా ఎగ్జైటింగ్గా చెప్పాడు. ఈ పీరియాడిక్ కథను క్రిష్ కూడా పవన్ ఇమేజ్ కి సరిపోయేలా రెడీ చేస్తున్నారట. రెండు సినిమాలతో పవన్ కళ్యాణ్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: