పూజా హెగ్డె ముద్దు గుమ్మ. ఆమెను చూస్తే భయపెట్టాలని ఎవరికైనా అనిపిస్తుందా, వినడానికే నవ్వుతాలుగా లేదూ..  సినిమాల్లో విలన్లు కూడా హీరోతో పోరాడుతారు తప్ప హీరోయిన్ని కంటికి రెప్పగానే చూసుకుంటారు.ఆమె కోసం యుధ్ధాలు చేసి చస్తారు కూడా.

 


అలాంటిది పూజాను హీరో గానే భయపడుతున్నారుట. ఇంతకీ ఆ హీరో ఎవరని ఆరా తీస్తే ఆయన  మరెవరో కాదు, కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఆయన హిందీ సీమలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు, అద్భుతమైన కెరీర్ ఆయనకు ఉంది. అటువంటి  సల్మాన్ ఖాన్ తో నటించాలంటే భయం, కంగారుగా ఉందిట పూజాకు.

 

ఇక పూజా టాలీవుడ్ తో పాటే బాలీవుడ్లోనూ పాగా వేయాలని చూస్తోంది. దాంతో ఆమెకు సల్మాన్ పక్కన 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా చేయడానికి బంపర్ ఆఫర్ వచ్చిందంట. దీనిపై తాజాగా ఆమె మాట్లాడుతూ,  "సల్మాన్ గొప్ప నటుడు. ఆయన సరసన నటించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఆయన సొంతం. ఆయన సీనియారిటీ .. క్రేజ్ నన్ను కాస్త భయపెడుతున్నాయి. అంటోంది.

 

మరో వైపు మాత్రం ఆయన జోడీగా ఛాన్స్ దక్కడం ఆనందంగాను వుంది. నటన పరంగా ఆయన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. మొత్తానికి సల్మాన్ భయపెడుతున్నాడా లేక ఆయన్ని చూసి పూజా భయప‌డుతోందా. నటిస్తే ఏదో ఒకటి తేలిపోతుంది కదా.

 

ఏది ఏమైనా పూజా మాత్రం తక్కువ తిందా ఏంటి.ఆమెకు కూడా అనుభవం లేదా. గండర గండడు లాంటి ఎంతో మంది హీరోలను ఓర చూపులతో పడగొట్టిన బుట్ట బొమ్మ ముందు కండల వీరుడు సైతం కత్తి తీసి పడేయాల్సిందే. అది అంతేగా.అంతేగా.

మరింత సమాచారం తెలుసుకోండి: