గత రెండేళ్ల నుండి  వరుస పరాజయాలను చవి చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ కు ఈ  ఏడాది ప్రారంభం లో కూడా షాక్ తప్పలేదు. ఇటీవల రవితేజ, డిస్కో రాజా తో ప్రేక్షకులముందుకు రాగ ఈ చిత్రం కూడా డిజాస్టర్ల జాబితాలో చేరింది. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం రవితేజ, గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ లో నటిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా  వస్తున్న ఈచిత్రంలో రవితేజ , పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా దాదాపు షూటింగ్ కూడా పూర్తయింది.
 
ఇప్పటికే విడుదలైన క్రాక్ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా అతి త్వరలో మొదటి సాంగ్  విడుదలకానుందని సమాచారం. ఈ చిత్రంతో శృతిహాసన్ మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుండగా సముద్రఖని , చిరాగ్ జానీ , వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక  ఈ చిత్రాన్ని మే  8న విడుదలచేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల  విడుదల వాయిదా పడే అవకాశాలు వున్నాయి. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా  రవితేజసినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 
 
ఇదిలావుంటే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు రవితేజ. అందులో భాగంగా క్రాక్ తరువాత రవితేజ, రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. కోలీవుడ్ మూవీ శతురంగ వెట్టై 2  స్పూర్తితో  తెరకెక్కనున్న ఈ చిత్రం జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. సత్యనారాయణ కోనేరు ,హవీష్  కోనేరు ఈ సినిమా ను నిర్మించనున్నారు. ఈ సినిమా తోపాటు త్రినాథ రావు నక్కిన అలాగే  నాపేరు సూర్య తో డైరెక్టర్ వక్కంతం వంశీ తో సినిమాలు చేయడానికి  రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: