ఈ మధ్య కాలంలో సినిమాలు హిట్ కావాలి అంటే అంటే కథ కొత్తగా ఉండటం కాదు హీరోలు ఆ కథ కోసం ఎక్కువగా కష్టపడాలి. అప్పుడే మార్కెట్ అనేది భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ అగ్ర దర్శకులు అందరూ కూడా హీరోలతో సినిమాలు చేసే సమయంలో మీ నుంచి మాకు ఎం కావాలో చెప్తున్నారు. దీనితో దర్శకుల మాటను కాదు అనలేని హీరోలు తమ వంతు గా సినిమా కోసం ఎక్కువగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇదే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి హిట్ కొట్టలేదు. 

 

ప్రస్తుతం ఆయన కొరటాల శివ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పాట పాడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కథలో పట్టున్నా సరే ఒక పాట పడితే సినిమాకు మార్కెట్ పెరిగే అవకాశం ఉందని భావించి అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఇందులో ఆయన ఒక ఉదయం పాట పాడే అవకాశం ఉందని సమాచారం. పాటను చంద్రబోస్ రాసారని చిరంజీవి కి తగిన విధంగా ఈ పాటను ఆయన సిద్దం చేసారని సమాచారం. చిరంజీవి కూడా అందుకు ఓకే చెప్పారని తెలుస్తుంది. 

 

ఈ సినిమాలో చిరంజీవి అడవిలో ఒక పాట పాడే అవకాశం ఉందని ఆ పాట రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి పాడే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ప్రస్తుతం సినిమా మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు చిరంజీవి ఎక్కువగా పాట పాడటానికి ఆసక్తి చూపించారు అనేది కొందరి మాట. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరి చిరంజీవి పాట ఉంటుందో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: