స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వెండితెర మీదకు రావాలనే కోరికతో ఏదో ఒకటి చేసేద్దాం అనుకునే వారు స్మాల్ స్క్రీన్ ఆఫర్స్ కు సైన్ చేస్తారు. అయితే అక్కడ క్లిక్ అయితే మాత్రం ఇక దాన్ని వదిలి రావాలన్నా రాలేరు. సినిమా వాళ్ళకైనా సినిమా చేస్తేనే రెమ్యునరేషన్ ఉంటుంది. అంతేకాదు ఒక సినిమాకు ఒకటే రెమ్యునరేషన్ కానీ సీరియల్స్ కు అలా కాదు.. సీరియల్ క్లిక్ అయితే అది సంవత్సరాలు సంవత్సరాలు కొనసాగుతుంది. 

 

బాలీవుడ్ లో ఏక్తా కపూర్, బాలాజీ టెలీఫిల్మ్స్ వారు చేసే సీరియల్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. కబీ బహు థీ సీరియల్ బుల్లితెర మీద రికార్డులు సృష్టించింది. అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ గా ఆ సీరియల్ పేరు తెచ్చుకుంది. అందుకే నటించిన అమ్మడు కరిష్మాయ తన్నా.. తాను ఆడిషన్స్ లో పాల్గొన్నప్పుడు కెమెరా ఆన్ చేయగానే బుక్కయ్యి దాన్ని.. స్టార్ కెమెరా యాక్షన్ అన్న ప్రతిసారి నాలో టెన్షన్ మొదలయ్యేది. అయితే ఆడిషన్ టైం లో ఏక్తా కపూర్ తనలోని టాలెంట్ కన్నా తను ఎలాగైనా నటిస్తా అనే నమ్మకంతో తీసుకున్నారు. 

 

ప్రసుత్తం కరిష్మా తన్నా రోహిత్ శెట్టి డైరక్షన్ లో కత్రొంకి ఖిలాడు రియాలిటీ షోతో కూడా అదరగొట్టింది. హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాదన్నట్టు అందాలను గుమ్మరిస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు దుమ్ముదులిపేస్తుంది. బికినీ స్టిల్స్ తో కరిష్మా కవ్విస్తుంది. సీరియల్స్ చేస్తూ సినిమాల్లో కూడా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది అమ్మడు. సీరియల్ స్టార్ అని తక్కువ అంచనా వేయలేం.. సగటు హీరోయిన్ లా అందంతో అభినయంతో అమ్మడు చేస్తున్న ఈ హంగామా అందరిని అలరిస్తుంది. మరి ఈ అమ్మడు సినిమాల్లో కూడా రాణించాలని ఆశిద్దాం.   

మరింత సమాచారం తెలుసుకోండి: