ఈరోజు ఉదయం ప్రధాని మోడీ లాక్ డౌన్ పొడిగింపు పై ఏమి చెప్పబోతున్నారు అన్న ఆసక్తి అనుక్షణం అందరిలోనూ పెరిగిపోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు దశల వారీగా వెసులుబాటు కల్పించి కనీసం మే నెల నుండి అయినా తిరిగి భారతీయ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే దశలో మోడీ నిర్ణయాలు ఉంటాయి అని అంటున్నారు.

 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కనీసం జూన్ నెల నుండి అయినా తిరిగి షూటింగ్ లు మొదలవ్వడమే కాకుండా ధియేటర్లు కూడ తెరుచుకునే ఆస్కారం కనిపిస్తోంది. దీనితో రాజమౌళి తన యాక్షన్ ప్లాన్ లో ముందుగానే మార్పులు చేసి ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఏదోవిధంగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయడానికి ప్రస్తుతం చరణ్ జూనియర్ ఇళ్లలోని ఒక గదిని సౌండ్ ప్రూఫ్ గదిగా మార్పించి ఆ గదిలో పవర్ ఫుల్ మైకులు పెట్టించి ఇప్పటి వరకు షూటింగ్ జరిగిన ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేయిస్తున్నట్లు టాక్.

అదేవిధంగా ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ పూనా షెడ్యూల్ ను పూనాకు వెళ్ళకుండా రామోజీ ఫిలిం సిటీలో ఆనాటి బ్రిటీష్ బిల్డింగ్స్ ను పోలిన భారీ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేసి కరోనా సమస్యలు వల్ల ఇంకా కొంతకాలం షూటింగ్ లు వాయిదా పడవలసి వచ్చినా ఆ లేట్ ను కవర్ చేయడానికి ఇలా యాక్షన్ ప్లాన్ ను రామోజీ ఫిలిం సిటీకి మార్చినట్లు సమాచారం. కరోనా యూరప్ లో తీవ్రరూపం దాల్చడంతో తన లేటెస్ట్ మూవీ షూటింగ్ ను మధ్యలో ఆపుకుని భాగ్యనగరం తిరిగి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు తన తన మూవీ షూటింగ్ ను కూడ మళ్ళీ యూరప్ వెళ్ళకుండా యూరప్ ను పోలిన వాతావరణాన్ని రామోజీ ఫిలిం సిటీలో క్రియేట్ చేస్తూ వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో తన మూవీ షూటింగ్ కొనసాగించడానికి ప్రభాస్ కూడ రెడీ అవుతున్నట్లు టాక్.

 

ఇప్పుడు ఇదే లిస్టులో తాను కూడ ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి సంబంధించి రాజస్థాన్ లోని ఒక ప్యాలెస్ పోలిన భారీ సెట్ ను ఇదే రామోజీ ఫిలిం సెట్ లో రెడీ పెడుతూ షూటింగ్ లు మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో రానున్నరోజులలో హైదరాబాద్ లో షరతులతో కూడిన లాక్ డౌన్ అమలులో ఉన్నా టాప్ హీరోలు అంతా పూర్తిగా రామోజీ ఫిలిం సిటీలోనే రాత్రి పగళ్ళు ఉంటూ రామోజీ ఫిలిం సిటీలో క్వారెంటైన్ గా కొనసాగుతూ ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలను మన్నిస్తూనే మరొక వైపు తమ సినిమాలను పరుగులు తీయించే మాష్టర్ ప్లాన్ లో ఉన్నారు అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: