బాహుబలి సినిమా తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రౌద్రం, రణం, రుధిరం అనే డెఫినిషన్ తో రూపొందుతున్నఈ చిత్ర షూటింగ్ కరోనా ఎఫెక్ట్ వల్ల వాయిదా పడింది. దీంతో సినిమాపై అనేక పుకార్లు వస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమాలకి చాలా టైమ్ తీసుకుంటాడు. అందువల్ల ఆర్.ఆర్.ఆర్ ని అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు.

 

అయితే ఈ మాటలని రాజమౌళి చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు.  లాక్డౌన్ సమయంలో మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసి, సినిమా విడుదలని ప్రకటించిన తేదీనే రిలీజ్ చేస్తామని ప్రకటించినా కూడా మళ్ళీ పుకార్లు చెలరేగుతున్నాయి. దాంతో రాజమౌళి సినిమా పనులు స్టార్ట్ చేశాడు. ఇంట్లోనే ఉండి ఆర్.ఆర్.ఆర్ డబ్బింగ్ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాడు.

 

ఎవరి ఇళ్లలో వారు ఉండి డబ్బింగ్ పనులని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అందుకోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి క్వాలిటీ మైక్ పంపించాడని సమాచారం. డబ్బింగ్ కి కావాల్సిన థియేటర్ తో పాటు అన్ని సౌకర్యాలు ఇద్దరు హీరోల ఇళ్ళలో ఉండడంతో రాజమౌళి ఆ దిశగా అడుగేసాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కూడా డబ్బింగ్ జరుపుకుంటుందట. ఈ ప్రాసెస్ ని రాజమౌళి, మదన్ కార్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూపర్ విజన్ చేస్తున్నారు.

 

ఆర్.ఆర్.ఆర్ విడుదల వాయిదా పడుతుందని వార్తలు సమయంలో రాజమౌళి పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా అనుకున్న సమయానికే విడుదల చేసేలా కనబడుతున్నాడు. అయితే డబ్బింగ్ థియేటర్లలో వచ్చినంత క్లారిటీ వస్తుందా అనేది సందేహంగా ఉంది. రాజమౌళి క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడడు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి రాజమౌళిలా లాక్డౌన్ ని ఇంకెంతమంది ఉపయోగించుకుంటారో..!

మరింత సమాచారం తెలుసుకోండి: