తేజ దర్శకత్వంలో ఉదయ్‌ కిరణ్‌ హీరోగా తెరకెక్కిన నువ్వు నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ అనిత. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా సూపర్‌ హిట్ అందుకున్న ఈ భామ, తరువాత తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే బుల్లితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది  ఈ బ్యూటీ. దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గినా బుల్లితెర మీద మాత్రం యమా బిజీగా ఉంది అనిత.

 

ఈ రోజు (ఏప్రిల్ 14)న పుట్టిన రోజు సందర్భంగా ఈ భామ జీవితంలోని ఓ క్రేజీ టర్న్‌ను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. నాగిని సీరియల్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ చాలా కాలం పాటు ఓ నటుడితో డేటింగ్ చేసి తరువాత అతడికి బ్రేకప్‌ చెప్పేసి మరో వ్యక్తిని పెళ్లాడింది. సోషల్‌ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ తన మీద వచ్చే రూమర్స్ విషయంలోనూ వెంటనే రియాక్ట్ అవుతుంటుంది. నటుడు ఇజాజ్‌ ఖాన్‌తో చాలా కాలం రిలేషన్‌ షిప్‌లో ఉన్న అనిత తరువాత అతనికి బ్రేకప్ చెప్పేసి జిమ్‌లో తనకు పరిచయం అయిన రోహిత్‌ రెడ్డిని వివాహం చేసుకుంది.

 

ఇటీవల అనితా గర్భవతి అంటూ వచ్చిన వార్తలపై కూడా ఫన్నీగా స్పందించింది అనితా. పలు మీడియా సంస్థలు అనిత దంపతులకు ట్విన్స్‌ జన్మించబోతున్నారంటు వార్తలు కూడా రాశాయి. అయితే ఆ సమయంలో అనిత స్పందించకపోగా, తాను గర్భం చూపిస్తున్నట్టుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు షాక్‌ ఇచ్చింది. అయితే అది నిజంగా గర్భం కాదు. సీరియల్‌ కోసం సెట్ చేసి ఫేక్ ప్రెగ్నెన్సీతో అనితా ఆ ప్రాంక్‌ ను చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

If this is what I do with a fake baby belly.... wonder whAt I’ll do with a real one 😂🤣😂 📸🎞🎥📽📸 #naagin3 @rohitreddygoa you better up your photography skills!

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

మరింత సమాచారం తెలుసుకోండి: