కరోనా క్రైసిస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్ర సమస్యలని ఎదుర్కొంటున్నాయి. కరోనా బారినుండి బయటపడడానికి ప్రపంచం మొత్తం పోరాటం చేస్తుంది. కరొనాని ఖతం చేసే మందు ఇంకా కనుక్కోనందున.. దీని నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి లాక్డౌన్ ఆయుధమే కరెక్ట్ అని అంటున్నారు. బయటకి వెళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదన్న కారణంగా జనాలంతా ఇళ్లలోనే ఉండిపోతున్నారు.

 

కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కరోనా ఎఫెక్ట్ ప్రతీ ఒక్కరి మీదా పడింది. కరోనా వల్ల తీవ్రంగా నష్టాన్ని చవిచూస్తున్న ఇండస్ట్రీలలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. లాక్డౌన్ వల్ల సినిమాలు ఆగిపోయాయి. షూటింగులు క్యాన్సిల్ అయ్యాయి. థియేటర్లు మూతబడ్డాయి. కొత్త సినిమా ప్రారంభాలని పక్కన పెట్టేశారు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు.

 

లాక్డౌన్ పూర్తయ్యాక కూడా నిబంధనలు కొనసాగే అవకాశం ఉంది. దశలవారిగా లాక్డౌన్ ని ఎత్తివేస్తామని ప్రకటించారు. కాబట్టి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేసినా ఉపాధి కోల్పోయిన జనాలు థియేటర్లకి రాగలరా అన్నది అనుమానంగా ఉంది. రెండు, మూడు వందలు పెట్టి సినిమా చూడగలరా అన్నది సందేహం.

 


ఈ నేపథ్యంలో థియేటర్ వ్యవస్థ పోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైనే ఆధారపడి వినోదాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది కనుక థియేటర్ వ్యవస్థ పోతుందేమో అని అంటున్నారు. అయితే థియేటర్లో సినిమా చూడడం అనేది ఒక అనుభవం. ఆ అనుభవం ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఇవ్వదు. ఎన్ని చేసినా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని ప్రతీ ఒక్కరి దగ్గరికి ఓటీటీ ద్వారా చేర్చడం సాధ్యం కాదు. 

 

అదీ గాక మరో విషయం ఏమిటంటే, చైనాలో డెభ్భై రోజుల లాక్డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ కానున్నాయి. కాబట్టి సినిమా నిర్మాతలు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: