అనుష్క ఉంటే చాలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సూపర్  బిజినెస్ జరుగుతుంది. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ అనగానే దర్శక నిర్మాతలకు మొదటగా గుర్తొచ్చే పేరు స్వీటీ. అలాంటి  జేజమ్మకు నెటిజన్లు చాలాసార్లు పెళ్లి చేశారు. ఈమె పర్సనల్స్ ని తంబ్ నైల్స్ కు ఎక్కించారు.

 

అనుష్క అనగానే ఆమె అభిమానులకు ఒక అరుంధతి, ఒక రుద్రమదేవి, ఒక దేవసేన గుర్తుకు వస్తారు. బోల్డన్ని గ్లామరస్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. కానీ నెటిజన్లకు మాత్రం స్వీటీ అంటే పెళ్లి అనే మాట గుర్తుకువస్తుంది. ఈమె ప్రేమలో పడిందని ఒకసారి, పెళ్లి సంబంధం కుదిరందని మరొకసారి, టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ కుర్రాడితో ఏడడుగులు వేస్తుందని మరోసారి, ఇలా బోల్డన్ని వార్తలు సృష్టిస్తుంటారు. 

 

అనుష్క మంచితనం గురించి టాలీవుడ్ మొత్తం మాట్లాడుతుంది. కానీ కోలీవుడ్ మీడియా మాత్రం ఈమె పెళ్లి గురించి పుకార్లు పుట్టించింది. తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లు లాంటి వారు అనిపించుకున్న ఓ ఫ్యామిలీ కుర్రాడిని పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం చేసింది. అయితే ఆ హీరో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యాడనుకోండి అది వేరే విషయం. 

 

హిందీ మీడియా అయితే అనుష్కకు బాహుబలితో ప్రేమ అని ప్రచారం చేసింది. ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని వార్తలు రాసింది. ఈ ప్రచారం ఎక్కువ అవడంతో బాహుబలి, దేవసేన ఇద్దరూ ఈ వాల్తను వ్యతిరేకించారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇక త్రిష, కళ్యాణి ప్రియదర్శన్.. ఇలా బోల్డంత మంది హీరోయిన్స్ గురించి పెళ్లి వార్తలు రాశారు. దీంతో సోషల్ మీడియా అంటేనే హీరోయిన్లు భయపడే పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మొత్తానికి హీరోయిన్లకు ఇప్పుడు గాసిప్ రాయుళ్ల నుంచి ఎలా బయటపడాలా అని సతమతమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: