బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పటికే ఎన్నో దాన ధర్మాలు చేసి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనే పేరు ని సంపాదించుకున్నారు. కరోనా మహమ్మారి మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత కూడా షారుక్ ఖాన్ ఎంతోమంది పేద ప్రజలకు దానధర్మాలు చేశారు. ఆయన నాలుగు అంతస్తుల ఆఫీసును కూడా క్వారంటైన్ కేంద్రానికి ఇచ్చేశారు.


అయితే తాజాగా ఈయన మళ్లీ 25వేల పీపీఈ (personal protective equipment) కిట్లను మహారాష్ట్రలోని వైద్య సిబ్బందికి ఉచితంగా పంపించారు. అయితే షారుక్ ఖాన్ తన దాన ధర్మాల గురించి ఎవ్వరికీ చెప్పడు. విరాళాలు, దాన ధర్మాలు అనేవి ఎవరికీ చెప్పకుండా చేసే కార్యకలాపాలు అని ఆయన భావిస్తాడు. ఇప్పటికే ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని వారి అవసరాల కోసం ఎన్నో డబ్బులు విరాళంగా ఇచ్చారు. భారతదేశంలో వైద్య రక్షణ వస్తువుల సదుపాయాల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలావరకు సర్కారీ ఆసుపత్రులలో కూడా రక్షణ వస్తువులు లేక ఆసుపత్రి వైద్యులు, నర్సులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. ప్రైవేటు వైద్యుల కంటే ముందుగా ప్రభుత్వ వైద్యులే కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్సనందిస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఈ నేపథ్యంలో N-95 మాస్కుల కొరత ఏర్పడడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు.


బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఈ విషయాన్ని గుర్తించి మహారాష్ట్రలో ఎవరైతే కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారో వారికి రక్షణ వస్తువులను పంపించారు. అయితే ఈ విషయం ఇప్పటివరకు గోప్యంగా ఉండగా... తన సహకారం గురించి తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే తనకు మద్దతు ఇచ్చినందుకు షారుక్ ఖాన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ 25వేల పీపీఈ కిట్లను ఇచ్చారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: