బాలీవుడ్ హీరోలు ఈ మధ్య తెలుగు కథలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కంప్లీట్ మీల్ లా ఉండే మన కథల్లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సీనియర్ హీరోల నుంచి మొదలుపెడితే కుర్రాళ్ల వరకు చాలామంది టాలీవుడ్ స్టోరీస్ లో మెరుస్తున్నారు. 

 

అక్షయ్ కుమార్ రెగ్యులర్ స్టోరీస్ ని విడిచిపెట్టి చాలా కాలమైంది. సమ్ థింగ్ స్పెషల్ గా ఉండే కథల్లోనే నటిస్తున్నాడు. హీరోయిజాన్ని పక్కనపెట్టి సామాజిక కథాంశాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. అలాంటి హీరో ఇప్పుడో తెలుగు సినిమాపై మనసు పారేసుకున్నాడట. త్రివిక్రమ్ కథ పట్టుకొని అల వైకుంఠపురము వెళ్లాలనుకుంటున్నాడట అక్షయ్. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల వైకుంఠపురములో. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కొట్టింది. 150కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ బన్నీ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీనే రీమేక్ చేయాలనుకుంటున్నాడట అక్షయ్ కుమార్. 

 

అక్షయ్ కుమార్ ఇంతకుముందు కూడా తెలుగు కథలను ముంబయికి పట్టుకెళ్లాడు. రాజమౌళి-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాను రీమేక్ చేశాడు అక్షయ్. ఈ కథను రౌడీ రాథోడ్ గా రీమేక్ చేసి మాస్ హిట్ కొట్టాడు. ఇక రాఘవ లారెన్స్ దర్శకత్వంలో చేస్తోన్న లక్ష్మీబాంబ్ కూడా రీమేక్ సినిమానే. కాంచన రీమేక్ గా తెరకెక్కుతోంది  ఈ కథ. మరి అక్షయ్ కుమార్ అల వైకుంఠపురముని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. 

 

సినిమాకు భాషతో పనిలేదు.. భావం ముఖ్యం. ఎమోషనల్ గా కనెక్ట్ అయితే చాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ ని కట్టబెడుతుంది. ఇక ఇలాంటి కథల కోసం వెతుకుతున్న హీరోలు, ఎమోషనల్ ఎంటర్ టైనర్స్ ఎక్కడున్నాయంటే అక్కడ వాలిపోతారు. అలా ముంబయి నుంచి హైదరాబాద్ కు వస్తోన్న హీరోలు పెరిగిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: