స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎంతోమంది డైరెక్టర్ లు  ఎన్నో కథలు సిద్ధం చేసుకుంటారు అనే విషయం తెలిసిందే. అటు హీరోలు కూడా చాలా కథలు వింటూ ఉంటారు. కానీ చాలా తక్కువ కథలు ఓకే చేస్తుంటారు. దీంతో తాము  తీయాలనుకున్న హీరో కథ  దూరం పెట్టడంతో వేరే హీరోలతో సినిమాలు చూస్తూ ఉంటారూ దర్శకులు . అయితే ఇలా స్టార్ హీరోలు కొన్ని కొన్ని సార్లు వదులుకున్న సినిమాలు ఆ తర్వాత వేరే హీరోల తీయగా అవి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తాయి. దీంతో చాలా మంది హీరోలు ఆ కథలు ఎందుకు వదలుకున్నామా  అని బాధపడుతూ ఉంటారు. ఇలా అల్లుఅర్జున్ జాబితాలో కూడా వదులుకున్న ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్  కథకు నో చెప్పడంతో ఆ తర్వాత వేరే హీరో దర్శకుడు ఈ సినిమాను ఆ కథ తెరకెక్కించటం.. ఆ తర్వాత అది  బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకోవటం ఇలా జరిగిపోయింది. 

 

 

 మామూలుగా అయితే డేట్లు కుదరక పోవడం వలన... ఫలేదా  కథ నచ్చక పోవడం వలన కొన్ని కథలను వదిలేస్తూ ఉంటారు స్టార్ హీరోలు. ఇలా అల్లు అర్జున్ వదిలేసిన చాలా కథలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవి చాలానే ఉన్నాయి. అయితే మనం కాదని వదిలేసుకున్న కథలు మంచి హిట్ కొట్టినప్పుడు ఎవరికైనా కాస్త బాధ ఉంటుంది. అది అల్లు అర్జున్ కి కాస్త ఎక్కువ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లు కూడా అందించారు. అయితే బన్నీ వదులుకున్న కొన్ని కథలు మాత్రం ఇంతకుమించిన బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి అనే చెప్పాలి. 

 

 

 ముఖ్యంగా బన్నీ వదులుకున్న సినిమాల జాబితాలో జయం,  భద్ర,  100% లవ్,  పండగ చేసుకో,  అర్జున్ రెడ్డిగీత గోవిందం లాంటి సినిమాలు కనిపిస్తున్నాయి. ముందుగా దర్శక నిర్మాతలు ఈ సినిమాను బన్నీతో తెరకెక్కించాలని భావించి బన్నీ కి కథ వినిపించాడట. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో.. లేదా కథ నచ్చకపోవడం కారణాలవల్ల బన్నీ ఈ సినిమాలో చేయలేకపోయాడట. దీంతో ఆ సినిమాలు వేరే హీరోతో తెరకెక్కించాల్సి  వచ్చింది. ఇక బన్నీ  వదులుకున్న ఈ సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా మొన్నటికి మొన్న నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్... అప్పుడెప్పుడో చైతు హీరోగా వచ్చిన ఒక లైలా కోసం... రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా కథలు కూడా బన్నీ  దగ్గరికి ముందుగా వచ్చాయట. ఇక ఈ సినిమాలో బన్నీ వదులుకోగా... ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: