పూజ హెగ్డే... ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు ఇది. ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా ఇటీవలి కాలంలో సూపర్ హిట్ అయ్యాయి. దీనితో ఆమెను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఇప్పుడు హీరోలు కూడా దర్శక నిర్మాతలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆమె సినిమాల్లో ఉంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఉన్నారు అనేది వాస్తవం. ప్రస్తుతం పూజ తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు అన్నీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన సినిమా ఒకటి సూపర్ హిట్ అయింది. 

 

సినిమా తర్వాత ఆమె... ప్రభాస్ తో అఖిల్ తో షూట్ చేస్తుంది. ఇప్పుడు ఆమె తమ సినిమాలో కావాలి అని అగ్ర హీరోలు కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. రవితేజా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా కొందరు హీరోలు ఆమెను తమ తమ సినిమాల్లో ఉంచాలి అని కోరినట్టు సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అయితే ఆమె లక్కీ హీరోయిన్ అయింది. రెండు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరో సినిమా ఎన్టీఆర్ తో చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

ఇప్పుడు హీరోలు అందరూ ఆమెను తమ సినిమాలో ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పారితోషికం కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తూ వస్తుంది. అయినా సరే వెనకడుగు వేసే పరిస్థితి కనపడటం లేదు. ఆమె సినిమాలో ఉంటే చాలు అనుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా ఉన్న నేపధ్యంలో ఆమె అటు బాలీవుడ్ లో కూడా షూటింగ్ చేసే అవకాశాలు కనపడటం లేదు. ప్రస్తుతం ఖాళీ గానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: