టాలీవుడ్ లో సినిమా మార్కెట్ పెరిగిన తర్వాత హీరోలు అందరూ కూడా కలిసి పని చెయ్యాలి అనే నిర్ణయం తీసుకుని సినిమాలను చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా వాళ్ళు సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది అనే విషయం అర్ధమవుతుంది. టాలీవుడ్ జనాలు కూడా దీనిని ఎక్కువగా కోరుకోవడం తో హీరోలు ఈ మార్కెట్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. మన తెలుగు హీరోలకు ఏది ట్రెండ్ అయితే దాన్నే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిన్న హీరోలు కూడా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపధ్యంలోనే సీనియర్ హీరో గా చిన్న హీరోగా ఉన్న గోపి చంద్ కూడా ఇప్పుడు తన సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తుంది. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ప్రభాస్ కి ఒక పాత్ర ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒక పది నిమిషాలు ప్రభాస్ ఉండే విధంగా చూడమని దర్శకుడ్ని కోరినట్టు సమాచారం. ప్రభాస్ కి విలన్ గా వర్షం సినిమాలో గోపి చంద్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి కూడా తెలిసిందే. 

 

ఇప్పుడు కెరీర్ లో ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపి చంద్ తన సినిమాలో ప్రభాస్ ఉండాలని దర్శకుడ్ని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం కెరీర్ లో గోపి చంద్ కి ఒక్కటి అంటే  ఒక్కటి కూడా మంచి హిట్ అనేది రావడం లేదు. దీనిపై అతని ఫాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని నుంచి బయటకు రావాలి అంటే ఇదే మార్గం అని భావిస్తున్నాడట గోపి చంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: