ఈ సంవత్సరం సంక్రాంతికి "అలా వైకుంఠపురం లో" సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. రష్మిక మందన అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో కనిపించబోతోంది. అయితే ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన పుష్ప టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో ఊర మాస్ గెటప్ లో కనిపించిన బన్నీ ఫోటో బాగా క్లిక్ అయింది.

 

 

అయితే ఇప్పుడు ఈ సినిమా కేవలం ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ వచ్చిపడింది. దీనికోసమే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా దానితో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. అయితే ఈ సినిమాలో లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ విషయాలు పక్కన పెడితే ప్రతి సినిమాలో ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో కూడా ఐటం సాంగ్ ఉందని తెలుస్తోంది.

 

 

ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఒక బోల్డ్ బ్యూటీని ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంకెవరో కాదు ఊర్వశి రౌతేలా. ఈమెకి తెలుగులో అంత ప్రజా ఆదరణ లేక పోయినా బాలీవుడ్లో మాత్రం ఈమెకు క్రేజ్ బాగానే ఉంది. దీనికి కారణం ఈమె తన కెరీర్ మొదటి నుంచి తన అందచందాలతో వెండితెరను వేడెక్కిస్తోంది ఈ హాట్ బ్యూటీ. అయితే ఇప్పటికే ఈ భామ గోపీచంద్ సిటిమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో అవకాశం దక్కించుకుంది. అయితే ఇప్పుడు సుకుమార్ కూడా తన సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఈ అందాల భామని ఎంచుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: