బొమ్మరిల్లు సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అందుకుంటాయని చెప్పిన సినిమా అది. దిల్ రాజు బ్యానర్ కు మంచి క్రేజ్ వచ్చేలా చేసింది ఆ మూవీ. భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించారు. 2006లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ కు ముందు యువ హీరో నవదీప్ ను అనుకున్నారట. అప్పటికే తేజ జై సినిమాతో తెరంగేట్రం చేశాడు నవదీప్. భాస్కర్ కథ చెప్పగానే నవదీప్ తో తీయాలని అనుకున్నాడు దిల్ రాజు. 

 

అయితే నవదీప్ మిస్ అవడం ఆ ఛాన్స్ సిద్ధార్థ్ అందుకోవడం జరిగింది. దిల్ రాజు దగ్గరకు భాస్కర్ రెండు కథలతో వచ్చాడట. అందులో ఒకటి బొమ్మరిల్లు కాగా.. మరొకటి పరుగు. రెండిటిలో బొమ్మరిల్లు సినిమా కథ బాగా నచ్చడంతో దిల్ రాజు వెంటనే సినిమా స్టార్ట్ చేద్దామని అన్నారట. కానీ భాస్కర్ హీరోయిన్ క్యారక్టరైజేషన్ విషయంలో కొత్తగా ప్రయత్నించేందుకు ఒక 15 రోజులు టైం అడిగారట. 

 

15 రోజులు టైం పాస్ చేసి.. దిల్ రాజుని కలిసే నాలుగు గంటల ముందు భాస్కర్ హా.. హా.. హాసిని క్యారక్టర్ మైండ్ లోకి వచ్చిందట. బొమ్మరిల్లు సినిమా సక్సెస్ లో హాసిని పాత్ర హైలెట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాతో జెనీలియాకు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె పేరు జెనీలియాకు బదులుగా హాసిని అని పిలిచేవారు. బొమ్మరిల్లు హిట్ తర్వాత భాస్కర్ దిల్ రాజు నిర్మాణంలో పరుగు సినిమా చేశారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: