బాలక్రిష్ణ హీరోయిన్ ఎవరు అన్నది ఇపుడు టాలీవుడ్లో అతి పెద్ద చర్చగా ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా బాలయ్యకు హీరోయిన్లు దొరకడంలదు. ఆ మాటకు వస్తే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడంలేదు. కానీ మధ్యలో బాలయ్య ఒక్కరే ఈ సమస్యతో ఉన్నట్లుగా మరోవైపు  మీడియా హైప్ చేస్తోంది. 

 

దాంతో నందమూరి హీరో బాగా అల్లరైపోతున్నాడు. ఇవన్నీ ఇలా ఉంచితే బాలయ్య బోయపాటి మూవీలో హీరోయిన్లుగా ఇప్పటివరకూ అరడజన్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. రకుల్ మొదలుకుని తమన్నా, కాజల్, కేధరిన్ థెరిస్సా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇలా పెద్ద లిస్టే వల్లించారు.

 

వీరందరి కంటే ముందు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా  పేరు కూడా వినిపించింది. ఆమె సైతం రిజెక్ట్ చేసిందని రాసేశారు. అయితే ఇవేమీ ఇంతవరకూ చిత్ర యూనిట్ ఖండించలేదు. కానీ తొలిసారిగా ఈ వూహాగానాలపైన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్  పెదవి విప్పారు.

 

బాలయ్యతో మూవీ మీద తాను పూర్తి ద్రుష్టి పెట్టానని, బయట మీడియా తనకు తోచినది రాసుకుంటోందని ఆయన అంటున్నారు. తాము మాత్రం ఎవరినీ ఇప్పటిదాకా సంప్రదించలేదని కుండబద్దలు కొట్టారు.

 

తాము మొదటి నుంచి బాలయ్య సినిమాలో కొత్త హీరోయిన్ని తీసుకోవాలన్నదే ద్రుష్టిలో పెట్టుకున్నామని, ఆ విధంగానే తాము ఒక ఇద్దరిని రెడీ చేసి పెట్టామని, తొందరలో వారిలో ఒకరిని సెలెక్ట్ చేసి మీడియాకు వెల్లడిస్తామని అంటున్నారు. అంటే బాలయ్య పక్కన కొత్త భామ ఆడిపాడుతుందన్న మాట. విశేషమే మరి.

 

ఇదిలా ఉండగా కరోనా వైరస్ ముప్పు తీరిన తరువాత ఈ మూవీని సెట్స్ మీదకు తెచ్చి అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని బోయపాటి మొత్తం స్కెచ్ రెడీ చేసిపెట్టుకున్నారట. మా బాలయ్య ఫుల్ కోపరేటివ్. సో మా సినిమా తొందరలోనే ధియేటర్లలోకి వస్తుందని అంటున్నాడు. సో ఫ్యాన్స్ వెయిటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: