ప్ర‌స్తుతం ఉన్న మోడ్ర‌న్ ప్ర‌పంచంలో ఒక‌ప్ప‌టిలాగా రిలేష‌న్స్ ఉండ‌డంలేదు. ఇక అత్తా కోడ‌ళ్ళ రిలేష‌న్‌లో అయితే చాలానే మార్పులు వ‌చ్చాయి అని చెప్పాలి. ఒక‌ప్పుడు అత్త అంటే కోడ‌లికి..కోడ‌లు అంటే అత్త‌కి ప‌డేది కాదు. కానీ ప్ర‌స్తుతం రోజులు మారాయి. ఒక‌రంటే ఒక‌రికి ప్రేమాభిమానాలు ఉంటున్నాయి. ఒక‌రి ఆలోచ‌న‌ల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకుంటున్నారు. అత్తాకోడ‌ళ్ళంటే ఇప్ప‌టి కాలంలో దాదాపు బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటున్నార‌ని చెప్పాలి. కొన్ని ఇళ్ళ‌ల్లో అంత‌లా మార్పులు వ‌చ్చాయి.  అందులో సెల‌బ్రెటీల ఇళ్ళ‌ల్లో అయితే ఈ క‌ల్చ‌ర్ మ‌రికాస్త ఎక్కువ‌గానే ఉంటుందని చెప్పాలి. 

 

స‌మంత అక్కినేని యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య భార్య అయిన స‌మంత ఓ స్టార్ హీరోయిన్‌. త‌న అత్త అమ‌ల గురించి మాట్లాడుతూ... మా అత్త‌మ్మ ల‌క్ష్మి నాగార్జున మొద‌టి భార్య ఆమెను నేను క‌ల‌వ‌డం చాలా త‌క్కువ‌. అయిన‌ప్ప‌టికీ మా మ‌ధ్య మంచి బంధం ఉంటుంది. ఇక చిన్న‌త్త‌య్య అమ‌లగారు అయితే నాకు బాగా క్లోజ్ ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఆమె నాకు ఒక తోబుట్టువులా అనిపిస్తుంది. చైత‌న్య‌, అఖిల్ ప‌నుల‌న్నీ ఆమె ఇప్ప‌టికీ ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది. స‌మాజం ప‌ట్ల కూడా ఆమె చాలా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. రెండు విధాలుగా కూడా నాకు అమ‌ల అత్త‌య్య ఇన్‌స్పిరేష‌న్ అని చెప్పాలి. 

 

ఇక స‌మంత పెళ్ళ‌యిన ద‌గ్గ‌ర నుంచి కూడా ఆమె న‌టించిన సినిమాల‌న్నీ మంచి హిట్ అయ్యాయ‌నే చెప్పాలి. గ‌తంలో ఆమె న‌టించిన సినిమాలు కూడా హిట్టే కానీ ఈ సినిమాలు మాత్రం మ‌రింత‌గా స‌మంత‌కు పేరు తెచ్చిపెట్టాయి అవేమిటంటే... తాను ఎక్కువ‌గా న‌టించిన చిత్రాల‌న‌నీ కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త నిచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆమె పెర్ఫార్మెన్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోతున్నారు. ఓబేబి, యుట‌ర్న్‌, జాను ఇలా వ‌రుస‌గా గ్లామ‌ర్‌తో సంబంధం లేకుండా కేవ‌లం పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న కొన్ని చిత్రాల్లో న‌టిస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను సంపాదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: