కరోనా ధాటికి ప్రపంచ దేశాలు శిథిలావస్థకు కు చేరుతున్నాయి. ఈ రక్కసి ప్రజలను పట్టి పీడిస్తుంది. కాదేది కరోనాకు అనర్హం అన్నచందంగా కరోనా వ్యాపిస్తుంది. దీని ధాటికి డబ్బున్నవాడేంటి పెదవాడేంటి అన్న చందంగా కరోనా బరితెగిస్తోంది. బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ నిన్నమొన్నటివరకు కరోనా పాజిటివ్ కారణంగా క్వారంటైన్ లో 20 రోజులు ఉండీ వైద్యం తీసుకుంది. కాని పదేపదే చేసిన బ్లడ్ టెస్టులో 6 సార్లు కరోనా పాజిటివ్ రాగామళ్లీ ఏడవ సారి కరోనా నెగటివ్ వచ్చి డీఛార్జి అయ్యారు . ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ పరిస్థితి అలానే తయారయ్యేలా ఉంది. 14 రోజుల క్రితం కరోనా పాజిటివ్ కారణంగా ఐసోలేషన్ లో చేరాడు .తరువాత నెగటివ్ రావడంతో డీఛార్జి అయ్యాడు కానీ నిన్న ఉన్నట్టుండి  జ్వరం వచ్చింది మళ్లీ హాస్పిటల్  కి వెళ్లగా కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యులు చెబుతున్న విషయం ఏమిటంటే నెగటివ్ నుండి పాజిటివ్ రావడం చాల అరుదు అందులోనూ కోలుకోవడం చాలాకష్టం అంటున్నారు. 
 
 
అయితే కరీమ్ మొరానీ  కూతురు మరియు భార్య కొన్నిరోజుల క్రితం విదేశాలకు వెళ్లివచ్చారు అప్పుడు వారికీ కరోనా పాజిటివ్ వచ్చింది పనిలో పనిగా తండ్రికి కూడా తగిలించారు. రీమ్ మొరానీ కి ఇదివరకే రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చిందని అదేసమయంలో బైపాస్  సర్జరీ కూడా జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు చనిపోయినవాళ్లలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అధికం కానీ కరీమ్ మొరానీ కి ఇప్పుడు 60 ఏళ్ళు పైపడ్డాయి . ఇప్పుడు తమతండ్రికి ఈ వ్యాధి తగ్గుతుందో లేదో అని విచారిస్తున్నారు . 
 
 
కరీమ్ మొరానీ 1990 లో యోధా సినిమాతో తాను నిర్మాతగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.  షారుఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ - దిల్ వాలే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. రావన్ - హ్యాపీన్యూఇయర్ లకు అసోసియేట్ ప్రొడ్యూసర్. బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ కి మంచి ఆప్తమిత్రుడు అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: