దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్.ఆర్.ఆర్)... ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీం' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన న్యూస్ ఒకటి బయటకి వచ్చిందట. 

 

ఈ సినిమాలో అలియా భట్ రోల్ గురించి ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఇన్ని రోజులు అలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో అలియా ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నప్పటికీ అది రామ్ చరణ్ కి జోడీగా కాదంట. వాళ్ళ మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండబోవని సమాచారం. కాకపోతే రామ్ చరణ్ అభ్యుదయ భావాలను ఇష్టపడే అమ్మాయిగా కనిపించనుందట. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ కాస్త నిరాశకు గురవుతున్నారట. ఇన్ని రోజులు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో తమ అభిమాన హీరో రొమాన్స్ చేయబోతున్నాడని ఆశించిన ఫ్యాన్స్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారట. 

 

కాగా 'రౌద్రం రణం రుధిరం' చిత్రాన్ని రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఫస్ట్ నుండి అన్ని యావత్ సినీ ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ రామ్ చరణ్ ఇంట్రో స్పెషల్ వీడియో ఒక రేంజ్ లో ఉన్నాయి. వీటితో అంచనాలు ఇంకా రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డేకి ఎన్టీఆర్ స్పెషల్ వీడియో వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: