ఇటీవల ఐదేళ్ల క్రితం వచ్చిన బాహుబలి తో పాటు, మూడేళ్ళ క్రితం వచ్చిన బాహుబలి 2 సినిమాల అత్యద్భుత విజయాలతో సూపర్ సక్సెస్ లు కొట్టిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, ఆ సినిమాల సక్సెస్ లతో ఎంతో గొప్ప పేరుని గడించడంతో పాటు దేశ విదేశాల్లోనూ టాలీవుడ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునే ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఇక ప్రస్తుతం మెగా నందమూరి హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి, ఎలాగైనా ఈ భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీతో మరొక సంచలన హిట్ కొట్టి తన సత్తాని మరో మారు నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. 

 

ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా డివివి దానయ్య ఈ సినిమాని అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో మన దేశాన్ని మొత్తము కూడా గడిచిన ఎండు వారాలతో పాటు మరొక రెండు వారాల పాటు, మే 3 వరకు కూడా పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేయబడ్డాయి. అయితే ప్రస్తుతం తమ సినిమాని ఎలాగో వీలైనంతలో వర్క్ ఫ్రమ్ తో కొంత వర్క్ ని నడిపిస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్, ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తుంటే సినిమాని రాబోయే జనవరికి రిలీజ్ చేసే పరిస్థితులు చాలావరకు కనపడడం లేదని లోలోపల ఆందోళన చెందుతున్నారట. 

 

అయితే అందుకు ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయని, ఈ సినిమాలో యూరోప్ తో పాటు ఇతర విదేశాలకు చెందిన కొందరు విదేశీ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండడం, ప్రస్తుతం వారు వాళ్ళ దేశంలో ఉండిపోవడంతో, అసలు మన భారత ప్రభుత్వం విదేశస్థులకు ఎప్పుడు ఇక్కడికి ప్రవేశం కల్పిస్తుందో తెలియని పరిస్థితి ఒకటైతే, మరోవైపు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండిపోయిందట. అయితే ఆ వర్క్ ని సదరు సీజీ కంపెనీల ఎంప్లాయ్ లు ఇంటినుండి చేసే వర్క్ కాదని, తప్పనిసరిగా అందరు ఉద్యోగులు కంపెనీకి హాజరై భారీ సర్వర్లు, సామర్ధ్యం గల సిస్టమ్స్ మీదనే చేయవలసిన వర్క్ అని, దానితో పాటు ఆ వర్క్ తాలూకు సెక్యూరిటీ సెర్వర్ల పాస్వర్డ్ లు ఎంప్లాయ్ లకు ఇంటికి ఇవ్వడం కుదరదని సీజీ వర్క్ నిర్వహించే కంపెనీలు తెగేసి చెప్తున్నాయట. దీనితో ఆర్ఆర్ఆర్ పరిస్థితి దాదాపుగా అయోమయంలో పడ్డట్లే అని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఆర్ఆర్ఆర్ మలి సమ్మర్ కో లేక, దసరాకో వచ్చే అవకాశం ఉందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: