మెగాబ్రదర్ నాగబాబు తనయుడైనమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ముందుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ సినిమా మాత్రం వరుణ్ కు ఆశించిన రేంజ్ విజయాన్ని అందించనప్పటికే, నటుడిగా తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల మెప్పు పొందారు వరుణ్. ఆపై క్రిష్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన హృదయానికి హత్తుకునే కథాంశంతో తెరకెక్కిన కంచె సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులు ముందుకు వచ్చిన వరుణ్, ఆ సినిమాలో తన అద్బుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పొందారు. 

 

ఆ తరువాత పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలు వరుణ్ కు చేదు అనుభవాలు మిగిల్చాయి. సరిగ్గా ఆ తరువాత యువ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో మంచి హిట్ అందుకున్న వరుణ్, ఆపై మరొక యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాతో ఇంకో హిట్ అందుకున్నారు. అనంతరం అంతరిక్షం వంటి ఫార్ములా బేస్డ్ సినిమా చేసిన వరుణ్, ఆపై వచ్చిన ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మంచి సక్సెస్ లు కొట్టాడు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న వరుణ్, నేడు ఫ్యాన్స్ తో తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా కాసేపు చాట్ సెషన్ నిర్వహించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. 

 

రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి మీరు ఏమి చెప్తారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు, వారిద్దరూ కూడా ఎంతో ఒదిగి  ఉంటారు, అలానే బాగా కష్టపడే మనస్తత్వం కలవారు అని చెప్పాడు. మీకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయాలని ఉంటుందా, లేక కంచె వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలని ఉంటుందా అని మరొక అభిమాని అడిగిన ప్రశ్నకు, తనకు అవి రెండూ మిక్స్ చేసిన సినిమాలు దొరికితే బెటర్ అనిపిస్తుందని, అయితే తనకు మాత్రం ఎక్కువగా కంచె మాదిరిగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందాలని ఉందని అన్నారు వరుణ్....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: