కొన్ని సార్లు ఎవరి జీవితం ఎవరి వల్లనో బాగుపడుతుందని అంటారు. అలాగే కొమదరి జీవితం నాశనం కావడానికి ఎదుటి వాళ్ళ స్వార్ధం, స్వలాభం, మూర్ఖత్వం అని చాలామందికి తెలిసిందే. ఎక్కువమంది ఎదుటి వాళ్ళు ఏమైపోతేనేమి మనం బావున్నామా ... కోట్లు గడించామా అన్నంతవరకే తప్ప మరో విషయం ఆలోచించరు. కాని మన టాలీవుడ్ దర్శకులు మాత్రం ఒక విషయంలో గ్రేట్ అనిపించారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత రాం తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అందరికి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఎప్పటి నుంచో వరుస ఫ్లాప్స్ తో హీరో రాం,  హీరోయిన్స్, మ్యూజిక్ మణిశర్మ ...ఇలా అందరూ హిట్ కోసం పడిగాపులు కాస్తున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ జీవితం మీద ఆశలు కలిగించింది.

 

దాంతో అందరూ కెరీర్ మళ్ళీ గాడిలో పడి స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి ఈ సక్సస్ చాలా కీలకంగా నిలబడిందని చెప్పాలి. ఎంతగా అంటే వెయ్యోనుగుల బలం వచ్చి ఒకేసారి రెండు సినిమాలు మొదలు పెట్టేంత. వాటిలోలో ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా అయితే ఇంకోకటి కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ అనే సినిమా. అయితే ఈ సినిమాకి పూరి కథ, మాటలు మాత్రమే అందుస్తున్నారు. దర్శకత్వం వహించడం లేదు. ఈ సినిమాతో అనిల్ పాడూరి కి దర్శకత్వ బాధ్యలు అప్పగించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మి, పూరి నిర్మిస్తునారు.

 

ఇక సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి అయిదు భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అని అందరికి షాకిచ్చారు. చెప్పాలంటే ఆర్.ఆర్.ఆర్ , ప్రభాస్ సినిమాల తర్వాత మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటే అల్లు అర్జున్ పుష్ప అనే చెప్పాలి. ఇక వాస్తవకంగా ఈ రెండు సినిమాలు ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం విదేశాలలో జరగాల్సి ఉంది. పూరి విజయ్ దేవరకొండ సినిమా ఒక షెడ్యూల్ బ్యాంకాగ్ లో ప్లాన్ చేశారు. షూటింగ్ కి లొకేషన్ లో దిగడానికి రెడీ అయ్యారు. అలాగే సుకుమార్ అల్లు అర్జున్ సినిమా కూడా మొదటి షెడ్యూల్ విదేశాల్లోనే ప్లాన్ చేశారు. 

 

అయితే కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు డైరెక్టర్లు ముందు ముందు జరిగే నష్టాన్ని అంచానా వేసి ఉన్నపలంగా షెడూల్ ని క్యాన్సిల్ చేశారు. అసలు లొకేషన్ కి వెళ్ళకుండానే ముంబై నుండి పూరి టీం హైదరాబాద్ వచ్చేశారు. అయితే ఈ ఇద్దరు దర్శకులు గనక లైట్ గా తీసుకొని ఏమాత్రం కాస్త అజాగ్రత్తగా ఉండి విదేశాలలో షూటింగ్ చేసి ఉంటే యూనిట్ లో చాలా మంది కరోనా బారిన పడేవాళ్ళని ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు. మొత్తానికి పూరి జగన్నాధ్, సుకుమార్ తీసుకున్న స్పాట్ డెసిషన్ ప్రాణ నష్టం జరగకుండా చేసిందని అభినందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: