కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మొత్తానికి రెండేళ్ల తరువాత సరైన హిట్ తో తన ఫ్యాన్స్ ని ఖుషి చేసారు. ఇక ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఈ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అందరి నుండి విశేషమైన స్పందన లభించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా అల్లు అర్జున్ సరసన యువ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. 

IHG's next film – <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EAST' target='_blank' title='east-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>east</a> ...

 

ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని దసరా పండుగా సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన మన దేశాన్ని లాక్ డౌన్ ప్రకటించడంతో మిగతా సినిమా షూటింగ్స్ తో పాటు ఈ సినిమా కూడా ఆగిపోయింది. అయితే లాక్ డౌన్ అనంతరం అత్యంత వేగంగా సినిమాని పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేద్దాం అని భావిస్తున్న పుష్ప సినిమా యూనిట్ కి, నేడు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతి పెద్ద షాక్ ని ఇచ్చినట్లు చెప్తున్నారు. 

 

సినిమాలోని మొత్తం ముగ్గురు విలన్లలో మెయిన్ విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతిసినిమా కోసం కేటాయించిన కాల్షీట్స్ మరికొద్దిరోజుల్లో ముగుస్తాయని, మరోవైపు ఆయన తమిళ్ లో చేయవలసిన మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా పెండింగ్ ఉండడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని కాదని, పుష్ప కు లాక్ డౌన్ అనంతరం తిరిగి కాల్షీట్స్ అడ్జస్ట్ చేయడం కుదరదని చెప్పారట విజయ్. దానితో ఒక్కసారిగా పెద్ద షాక్ కు గురైన పుష్ప యూనిట్, చేసేది లేక ఆయన స్థానంలో మరొక నటుడిని తీసుకునేందుకు అప్పుడే వెతుకులాట మొదలెట్టిందట. మరి  ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదుగాని ఒకవేళ ఇదేకనుక నిజం అయితే మాత్రం, ఇది ఒకరకంగా పుష్ప టీమ్ కి పెద్ద దెబ్బె అనే చెప్పాలి.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: