ఏ పరిశ్రమలో అయినా మెల్లగా ఒక్కోమెట్టు ఎక్కి పైకి రావలసిందే. అయితే అలా మెట్లు ఎక్కుతున్న సందర్భంలో మనకు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. కానీ వాటిని పెద్దగా లక్ష్య పెట్టకుండా అనుకున్న లక్ష్యం వైపు మాత్రమే మనకు గురిపెట్టి ముందుకు సాగితే మనకు వీలైనంత త్వరగా విజయం వరిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలానే ఆ క్రమంలో మనం పైకి ఎదుగుతున్న సమయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలను పదే పదే గుర్తు చేసుకోవడం కూడా చేయకూడదని వారు అంటుంటారు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇటీవల నటుడి నుండి హీరోగా మారి, ఒక్కొక్కటిగా మంచి విజయాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో పేరున్న హీరో హోదాలో కొనసాగుతున్న ఒక నటుడు, ఇటీవల కొద్దిరోజులుగా ఒక కమర్షియల్ సినిమాల దర్శకుడితో తన లేటెస్ట్ మూవీని మొదలెట్టాడు. అయితే ఆ సినిమా షూటింగ్ కొంత అట్టహాసంగానే ప్రారంభం అయింది. 

 

అలానే సదరు హీరోకి ఆ సినిమా బడ్జెట్ పరంగానే కాక కెరీర్ పరంగా కూడా ఎంతో ముఖ్యం అనే చెప్పాలి. ఇక సినిమా అనౌన్స్ చేసిన దగ్గరి నుండి, మొదటి రోజు షూటింగ్, అలానే తదుపరి మిగతా రోజుల షూటింగ్స్ జరుగుతున్న సమయంలో తన శక్తి కొలది దర్శకుడితో పాటు ఎంతో కష్టపడుతూ వస్తున్న సదరు హీరో, ఇటీవల ఒక సీన్ షూటింగ్ సమయంలో మాత్రం డైరెక్టర్ చెప్పిన విధంగా చేయలేకపోయాడట. అంతేకాక ఆ సీన్ ని అలా తీయడం కంటే, తాను అనుకున్న యాంగిల్ లో తీస్తే మరింత పండుతుందని ఆ దర్శకుడికి ఒక సలహా ఇవ్వడంతో, వెంటనే విపరీతంగా కోపం తెచ్చుకున్న దర్శకుడు, హీరో పై ఒక్కసారిగా ఊగిపోతూ, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతే తొక్కలోది మేమెందుకు ఇక్కడ అని ఒక డైలాగ్ వేయడం జరిగిందట. 

 

దానితో షూటింగ్ లో కొంత జాప్యం, ఆపై కరోనా ఎఫెక్ట్ వలన ఏకంగా సినిమా షూటింగ్స్ మొత్తం కూడా ఆగిపోవడంతోపాటు ఈ సినిమా కూడా ఆగిపోయి కొంత సమస్యల్లో ఇరుక్కుందని, అయితే రెండు రోజుల క్రితం ఎవరికి వారు కొంత రియలైజ్ అయిన ఆ హీరో, దర్శకులిద్దరూ మళ్ళి సరదాగా మాట్లాడుకుంటున్నారని సమాచారం. కాగా లాకౌట్ ఎత్తివేత అనంతరం తమ సినిమాని వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరగా థియేటర్స్ లోకి తేవాలని చూస్తున్నారట. ఈ మూవీ ఇండస్ట్రీ లో ఇటువంటి చిన్న చిన్న ఘర్షణలు కామన్ అని, అయితే వాటిని పదే పదే గుర్తు చేసుకోకుండా రెండు వైపుల వారు కూడా సర్దుకుపోతే అందరికీ మంచిదని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: