తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన సంచలనాలు ఓ చరిత్ర. సినిమాల్లో అంచెలంచెలుగా ఎదిగి హీరోగా, సుప్రీం హీరోగా మెగాస్టార్ గా టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరిపోయాడు. ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోగా దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా రాజ్యమేలుతున్నాడు. ఆయన నట వారసుడిగా తనయుడు రామ్ చరణ్ కూడా రాణిస్తున్నాడు. ఆయన కుటుంబ హీరోలను కలిపితే ఓ క్రికెట్ టీమ్ అంత ఉంటారని పేరు. ఇంత సాధించిన చిరంజీవిపై ఓ బయోపిక్ రావాలనే వాదనలూ ఉన్నాయి. దీనిపై చిరంజీవి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

 

 

‘నాపై బయోపిక్ తీసేందుకు నా కెరీర్లో చెప్పుకోదగ్గ ట్విస్టులు ఏమీ లేవు. బయోపిక్ కంటే నామీద డాక్యుమెంటరీ బెస్ట్ అని నా అభిప్రాయం. దీనిపై వర్క్ కూడా జరుగుతోంది. నేనే స్వయంగా నా కెరీర్ కు సబంధించిన ముచ్చట్లను అందులో పొందుపరుస్తున్నాను. ఇండస్ట్రీకి వచ్చే వారికి, నన్ను ఆదర్శంగా తీసుకునే వారికి అది ఉపయోగపడేలా ఉండాలి. నేను ఎందరికో ఆదర్శంగా ఉంటున్నానని అంటున్నారు. ఆ విషయం మనసుకు ఆనందాన్నిస్తోంది. ఈ విషయాలన్నింటినీ యాడ్ చేసి ఆ డాక్యుమెంటరీ రూపొందించాలనేది నా ప్రయత్నం. ప్రత్యేకించి సినిమానే తీయాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్.

 

 

చిరంజీవి బయోపిక్ తీయాలని సినీ పరిశ్రమలోని చాలామంది తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ విషయాన్ని రామ్ చరణ్, నాగబాబు కూడా లైట్ తీసుకున్నాడు. బయోపిక్ తీయాల్సిన అవసరం లేదని వారు కూడా చెప్పారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు బయోపిక్ అంటే ప్రేక్షకులను ధియేటర్లో కూర్చోబెట్టగలిగే ట్విస్టులు ఉండాలి. చిరంజీవి గురించి అంతా గొప్పగా ఉంటుందే కానీ నెగటివ్ ఉండదు. అందుకే మెగాస్టార్ తన బయోపిక్ అవసరం లేదని అంటున్నారని టాక్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: