ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తాడు జక్కన్న అంటూ పనులు మానుకుని ఎదురు చూస్తున్నారు కొందరు. ఈ సినిమా గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు వస్తున్నా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. ముందు జూలై లో ఈ సినిమాను విడుదల చెయ్యాలి అని భావించినా సరే ఆ తర్వాత మాత్రం సినిమాను మళ్ళీ దసరా కు అనుకున్నారు. అప్పటికి కూడా పనులు అయ్యే అవకాశం లేకపోవడం తో దానిని వచ్చే ఏడాది దసరా కు మార్చారు. 

 

మధ్యలో ఈ ఏడాది చివర్లో విడుదల చెయ్యాలి అని చూసినా సరే కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. ఇక ఇప్పుడు కరోనా కారణంగా వచ్చే ఏడాది... ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాకు నిర్మాతగా దానయ్య వ్యవహరిస్తున్నారు. కాని చిరంజీవి ఈ సినిమాలో పెట్టుబడి పెట్టాలి అని భావించినట్టు సమాచారం. తాను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తా అని చిరంజీవి వచ్చినా సరే సినిమా మాత్రం దానయ్య తోనే చేస్తా అని చెప్పారట జక్కన్న. 

 

దీనికి కారణం ఏంటీ అనేది ప్రత్యేకంగా తెలియకపోయినా... దానయ్య తో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని జక్కన్న భావిస్తున్నారు. వాళ్లకు మంచి స్నేహం ఉంది. అందుకే ఈ సినిమాను చేయడానికి దానయ్యే అని భావించి చిరంజీవి ని వద్దని అన్నారని సమాచారం. దీని మీద చిరంజీవి ఆగ్రహం కూడా వ్యక్తం చేసారని టాలీవుడ్ లో వార్తలు కూడా వచ్చాయి. ఒకానొక సందర్భంలో అసలు రామ్ చరణ్ ని ఈ సినిమా చేయవద్దు అని చెప్పారట చిరంజీవి. కాని రామ్ చరణ్ మాత్రం చేసారని... ఇక ఈ సినిమా కోసం వేరే సినిమాలు కూడా వదులుకున్నాడు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: