దూరదర్శన్‌లో ప్రసారమైన శాంతి సీరియల్‌ తో స్టార్ ఇమేజ్‌ అందుకున్న హాట్ బ్యూటీ మందిరా బేడి. తరువాత నటిగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా టెలివిజన్‌ వ్యాఖ్యతగా, క్రికెట్ కామెంటేటర్‌గా ఎన్నో రంగాలంలో తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ. అంతేకాదు ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో ఒకటైన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో కూడా నటించింది. డీడీలో ప్రసారమైన జౌరత్‌, దుష్మన్‌, క్యోంకి సాస్‌ బీ కబీ బహుతి లాంటి సూపర్‌ హిట్ సీరియల్స్‌లో నటించింది. 2003, 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్‌ కప్‌ కు వ్యాఖ్యతగా వ్యవహరించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది ఈ భామ.

 

వీటితో పాటు 2004, 2006లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ 2 లాంటి మెగా టోర్నిలకు కూడా వ్యాఖ్యతగా వ్యవహరించింది మందిరా. గ్లామర్‌ ఫీల్డ్ లో కొనసాగుతూనే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. 2014లో జరిగిన లాక్‌ మీ ఫ్యాషన్‌ వీక్‌ లో తాను డిజైన్‌ చేసిన చీరలు ప్రజెంట్ చేసింది మందిరా. 1972 ఏప్రిల్ 14న జన్మించిన ఈ భామ అనేక వివాదాల్లోనూ ఇన్వాల్‌ అయ్యింది.

 

గతంలో కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మందిర. ఈ విషయంలో కేవలం ఒక్కరిదే తప్పు అనటం కరెక్ట్ కాదన్న మందిరా.. రెండు వైపుల తప్పు ఉంటేనే ఇలాంటివి జరుగుతాయని ఆరోపించింది. అంతేకాదు సోషల్ మీడియాలో మందిరా బేడీ పోస్ట్ చేసే బోల్డ్‌ ఫోటోలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ భామ 1999, 14న ఫిబ్రవరి రాజ్‌ కౌషల్‌ను పెళ్లి చేసుకున్న ఈ భామ 2011లో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత 2013లో ఆడపిల్లను దత్తత తీసుకున్నారు ఈ దంపతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: