లాక్‌డౌన్ వేళ పోర్న‌సైట్ల‌కు వీక్ష‌కులు పోటెత్తుతున్నార‌ట‌. పోర్న్ వీక్షించే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగిన‌ట్లు పోర్న్‌హ‌బ్ సంస్థ ఇటీవ‌ల చేసిన ఓ స‌ర్వేలో వెల్ల‌డైన‌ట్లు త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి స‌ర‌దాగా గ‌డిపే అవ‌కాశం లేకపోవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా యువ‌త‌, పోర్న్ అభిమానులు తీరిగ్గా సైట్ల‌లో మునిగితేలుతున్నారు. ఇందులో ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే ఇలా వీక్షిస్తున్న వారిలో భార‌తీయులే అధికంగా ఉండ‌టం విశేషం. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా   ఫ్రాన్స్,  జర్మనీ, ఇటలీ, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా ఉన్నట్లు సర్వే పోర్న్ హ‌బ్ స‌ర్వేలో తేలిన‌ట్లు ప్ర‌క‌టించింది. 

 

IHG

 

జర్మనీ, ఇటలీ, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్‌‌ల్లోనూ ఆయా దేశాల్లో లాక్ డౌన్ విధించిన ఒకటి రెండు రోజుల్లోనే పోర్న్ వీక్షకుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిందంట‌. అలాగే ఫ్రాన్స్‌లో లాక్ డౌన్ విధించిన మార్చి 17 తర్వాత ఆ ఒక్కరోజులోనే 40 శాతం ఎక్కువ ట్రాఫిక్ నమోదు కావడం విశేషం.భార‌త్‌లో లాక్ డౌన్ విధించిన తర్వాతే తమకు ఏకంగా దాదాపు 60 శాతానికిపైగా వీక్షకులు పెరిగారని వెల్లడించింది. మొత్తం భారత దేశంలో పోర్న్ కంటెంట్ సైట్లకు వీక్షకుల సంఖ్య 95 శాతం ఎక్కువ ట్రాఫిక్ పెరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. సాధార‌ణంగా ప్ర‌జ‌లు ఖాళీగా ఉండ‌టంతోనే పోర్న్ సైట్ల‌కు వీక్ష‌కుల సంఖ్య పెరిగి ఉంటుంద‌ని స‌ర్వేలో పోర్న్‌హ‌బ్ సంస్థ స‌ర్వేలో అభిప్రాయ‌ప‌డింది. . 

 

IHG

 


 స్మార్ట్ ఫోన్ ఎప్పుడ‌యితే అందుబాటులోకి వ‌చ్చాయో అప్ప‌టి నుంచే పోర్న్‌సైట్ల‌కు వీక్ష‌కుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. గ‌తంలో న‌ష్టాలు ఎదుర్కొన్న పెద్ద‌పెద్ద సంస్థ‌లు కూడా ప్ర‌స్తుతం పెరుగుతున్న వీక్ష‌కుల సంఖ్య‌తో లాభాల బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ఈ  రంగంలోని కొంత‌మంది నిర్మాణ సంస్థ‌ల యజ‌మానులు పేర్కొంటున్నార‌ట‌.  ఇదిలా  ఉండ‌గా అన్ని ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సంస్థలు పోర్న్ సైట్లు భారత్‌లో ఓపెన్ కాకుండా నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.  అయితే భారత్‌లో ఆంక్షలు ఉన్నా.. ప్రత్యేక మార్గాలు, డొమైన్ల ద్వారా పోర్న్ సైట్లను చూసేవారు ఎక్కువ‌ని తాజాగా వెలువడుతున్న స‌ర్వేల ద్వారా అర్థ‌మ‌వుతోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: